లోకేష్ కనగరాజ్–అజిత్ కాంబోపై ఫ్యాన్స్‌ రియాక్షన్‌!

Share


ఖైదీ సినిమాతో దర్శకుడిగా ఒక్కసారిగా పాన్‌ ఇండియా రేంజ్‌లో నిలిచిపోయిన లోకేష్ కనగరాజ్‌, ఇప్పుడు కొత్త దశలో ఉన్నాడు. ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి హిట్స్‌ తో టాప్‌ లీగ్‌ లోకి ఎంటర్ అయినా, ఇటీవల వచ్చిన కూలీ సినిమా మాత్రం నిరాశపరిచింది. రజనీకాంత్‌ వంటి సూపర్‌స్టార్‌ ఉన్నా కూడా సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో లోకేష్‌ తదుపరి ప్రాజెక్టులపై ప్రశ్నలు మొదలయ్యాయి.

తన కెరీర్‌లోనే అతిపెద్ద క్రాస్‌ఓవర్‌గా భావించిన కమల్‌ హాసన్‌–రజనీకాంత్‌ మల్టీస్టారర్‌ మూవీ కూడా కూలీ ఫలితం కారణంగా నిలిచిపోయిందట. ఈ సినిమాలో సుందర్‌ సి దర్శకత్వం వహించాల్సి ఉండగా, నిర్మాణ బాధ్యతలు కమల్‌ హాసన్‌ తీసుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్‌ ఇప్పుడు అటకెక్కింది.

ఇదిలా ఉండగా, అజిత్‌తో సినిమా చేయాలన్న లోకేష్‌ ప్లాన్‌ మళ్లీ సజీవమవుతోంది. ఇప్పటికే అజిత్‌కు ఓ కథ వినిపించాడని, ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారని సమాచారం. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ కాంబినేషన్‌ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందట. అయితే, అజిత్‌ ఫ్యాన్స్ మాత్రం సోషల్‌ మీడియాలో “ఇప్పుడు లోకేష్‌ సినిమాకు టైమ్‌ కాదు” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అంతకుముందు అమీర్‌ ఖాన్‌తో సినిమా చేసేందుకు కూడా లోకేష్‌ ప్రయత్నించినా, ఆ ప్రాజెక్ట్‌ ఫైనల్‌ కాలేదు. ఖైదీ 2 సీక్వెల్‌ గురించి కూడా చర్చలు జరిగాయి కానీ కార్తీ డేట్స్‌ ఇవ్వకపోవడంతో ఆ సినిమా ముందుకు సాగలేకపోయింది.

మొత్తం మీద, బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌తో టాప్‌ పొజిషన్‌ అందుకున్న లోకేష్‌ కనగరాజ్‌ ఇప్పుడు క్రిటికల్‌ ఫేజ్‌లో ఉన్నాడు. అజిత్‌ మూవీతో మళ్లీ తన ఫామ్‌లోకి వస్తాడా? లేక అభిమానుల ఒత్తిడితో వెనక్కి తగ్గుతాడా? అన్నది చూడాల్సి ఉంది.


Recent Random Post: