
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాస్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఇటీవల ముంబైలో గ్రాండ్‌గా షురూ అయింది. ఈ భారీ పాన్ ఇండియా చిత్రంలో బన్నీకి జోడీగా ముగ్గురు హీరోయిన్‌లు నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అందులో దీపికా పదుకొణే ప్రధాన కథానాయికగా నటిస్తుండగా, మృణాల్ ఠాకూర్ సెకండ్ లీడ్‌గా కనిపించనుందని సమాచారం. ఇక థర్డ్ లీడ్ పాత్ర కోసం జాన్వీ కపూర్ పేరు వినిపిస్తుండగా, అదే రోల్‌కి నేషనల్ క్రష్ రష్మిక మందన్న పోటీ పడుతోందనే వార్తలు బలంగా చక్కర్లు కొడుతున్నాయి.
అయితే ఇప్పుడు కొత్తగా ఓ హాట్ బజ్ బయటకు వచ్చింది. రష్మిక ఇందులో విలన్‌గా నటించబోతుందట! ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ విలన్ క్యారెక్టర్ ఉండబోతుందని, దానికి మేల్ విలన్ కంటే ఫీమెల్ విలన్ అయితేనే బాగా న్యాయం చేయొచ్చని దర్శక నిర్మాతల అభిప్రాయం అని టాక్. అందులోనూ రష్మిక అయితే అది మరింత బలంగా కనిపిస్తుందని ప్రచారం వేగంగా జరుగుతోంది.
ఈ వార్తల నేపథ్యంలో “రష్మిక నిజంగా విలన్‌గా మారిపోతుందా?” లేదా “జాన్వీ కపూర్‌ను రీప్లేస్ చేస్తుందా?” అనే చర్చలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి. రష్మిక మాత్రం పాత్ర మేజర్ అండ్ ఇంట్రెస్టింగ్‌గా ఉందని భావించి ఓకే చెప్పిందని ఫిల్మ్ నగర్ వర్గాల మాట.
రష్మిక విషయంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఒక పర్ఫెక్ట్ పర్ఫార్మర్. పుష్ప 2 లో శ్రీవల్లి పాత్రను ఎలా పండించిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఛావా సినిమాలో మహారాజు భార్యగా చేసిన ప్రదర్శన కూడా ప్రశంసలందుకుంది. ప్రతి సినిమాతో తనను తాను కొత్తగా నిలబెట్టుకుంటున్న రష్మిక, ఇప్పుడు విలన్ క్యారెక్టర్‌లో రమ్యకృష్ణలా ‘నీలాంబరి’గా మెరగాలంటే ఆశ్చర్యం లేదు.
అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది మేకర్స్ అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే స్పష్టమవుతుంది. కానీ రష్మిక విలన్‌గా మారితే మాత్రం ఆ పాత్ర మరిచిపోలేని మైలురాయిగా నిలవనుంది.
Recent Random Post:















