
పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాను దర్శకుడు క్రిష్ మొదటిగా తీసుకోవడం తెలిసిందే. కానీ పవన్ రాజకీయాల్లో ఉపముఖ్యమంత్రి హోదాలో బిజీగా ఉండటంతో తన డేట్లు ఇవ్వలేకపోయాడు. దీంతో సినిమా చిత్రీకరణలో తడవులు వస్తున్నాయనే నెపంతో క్రిష్ అనుష్కతో ఘాటీ అనే కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించాడు.
అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ డేట్లు అందుబాటులోకి రావడంతో వీరమల్లు చిత్రాన్ని పూర్తిచేయడానికి క్రిష్ బదులు దర్శకుడిగా జ్యోతికృష్ణ వచ్చారు. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి క్రిష్‌తో పాటు జ్యోతికృష్ణకు కూడా టైటిల్ కార్డ్స్‌లో క్రెడిట్ ఇవ్వనున్నారు.
కానీ ఈ పరిణామాలపై కొంతమంది పవన్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పవన్ సినిమా మధ్యలో వదిలేసినట్టు విమర్శలు చేస్తున్నారు. అయితే ఘాటీ సినిమాను ప్రారంభించిన క్రిష్ కూడా ఇప్పటి వరకూ విడుదల చేయలేకపోవడం ఎలాంటి న్యాయం? అని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
ఘాటీ విడుదలపై ఎన్నో వాయిదాలు ఎదురవుతున్నాయి. మొదట ఏప్రిల్‌లో విడుదల చేస్తామని ప్రకటించగా, తర్వాత జులై 11కి మార్చారు. ఇప్పుడు ఆ తేదీ కూడా సాధ్యం కాదని తెలుస్తోంది. ప్రమోషన్లు మొదలు కాకపోవడంతో గందరగోళం నెలకొంది. సమాచారం మేరకు VFX పనుల్లో అసంతృప్తితోనే క్రిష్ విడుదలను వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటివరకు క్రిష్ కనీసం ఒక సినిమానైనా సమయానికి పూర్తి చేసి రిలీజ్ చేస్తే, ఫ్యాన్స్ లో నమ్మకం ఉండేది. కానీ వీరమల్లు వదిలేసి ఘాటీలోకి వెళ్లిన తర్వాత ఆ ప్రాజెక్ట్ కూడా ముందుకు సాగకపోవడం అభిమానులను ఆగ్రహానికి గురి చేస్తోంది. కొందరు సోషల్ మీడియాలో “ఒక సినిమా పూర్తి చేసి తర్వాత కొత్తదానిపై దృష్టి పెట్టాలి” అని అంటున్నారు.
ఇక అనుష్క విషయంలో, ఆమె మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తర్వాత మళ్లీ స్క్రీన్‌పై కనిపించబోయే చిత్రం ఇదే. క్రిష్ – అనుష్క కాంబోలో వేదం తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. మంచి కంటెంట్‌తో ఈ సినిమాను రూపొందించారని టాక్ ఉన్నప్పటికీ, వాయిదాలు పడుతూ పోతే బజ్ తగ్గే ప్రమాదం ఉంది. ప్రస్తుతం VFX వర్క్ చివరి దశలో ఉందని తెలుస్తోంది. సినిమాను ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో విడుదల చేసే అవకాశం ఉంది.
Recent Random Post:















