శర్వానంద్ 38: కొత్త లుక్‌తో సమర్పించనున్న సంపత్ నంది!

Share


శర్వానంద్ టాలీవుడ్‌లో ప్రతి సినిమాకూ కొత్తదనం తీసుకురావడానికి ప్రయత్నించే నటుల్లో ఒకరు. తన సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, పక్కింటి అబ్బాయిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న శర్వానంద్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.

ప్రస్తుతం అతను అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో, మాళవిక నాయర్ హీరోయిన్‌గా, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే, సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నారీ నారీ నడుమ మురారి అనే మరో చిత్రాన్ని కూడా చేస్తున్నాడు.

అలాగే, శర్వానంద్ తన 38వ సినిమాను దర్శకుడు సంపత్ నందితో చేయబోతున్న సంగతి తెలిసిందే. సంపత్ నంది తన సినిమాల్లో హీరోలను చాలా కొత్తగా ప్రెజెంట్ చేసే విధానం ప్రత్యేకం. గతంలో చేసిన చిత్రాల్లోనూ హీరోలకు మాస్ అప్పీల్‌ ఇచ్చిన సంపత్, ఈసారి శర్వాను పూర్తిగా కొత్త అవతారంలో చూపించనున్నట్లు సమాచారం.

ఇదో 1960ల నాటి కథతో రూపొందనున్న సినిమా కావడంతో, శర్వా క్యారెక్టర్‌కు తగ్గట్టుగా ఓ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నాడు. అందుకే ప్రస్తుతానికి అతను ముంబైలో మేకోవర్‌పై ఫోకస్ పెట్టాడు. ప్రముఖ స్టైలిస్టులు హకీమ్ ఆలిమ్, రషీద్ పట్టణం ఈ లుక్‌పై వర్క్ చేస్తున్నారు.

ఈ భారీ ప్రాజెక్ట్‌ను కె.కె. రాధామోహన్ నిర్మించనుండగా, ఉగాది సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలక అప్డేట్ రానున్నట్లు టాక్. శర్వానంద్ ఈ చిత్రంలో ఎలా కనబడబోతాడో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే!


Recent Random Post: