శివకార్తికేయన్ 25.. హఠాత్తుగా ఈ మార్పులేంటి..?

ఈమధ్య కాలంలో లేడి డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సుధా కొంగరా ఒకరు. ముఖ్యంగా ఆకాశమే హద్దురా సినిమా మంచి ప్రశంసలు అందించింది. అలాగే గురు వంటి డిఫరెంట్ చిత్రాలను డైరెక్ట్ చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆమె దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న పురాణనూరు అనే పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఈ ప్రాజెక్ట్ భారీ బడ్జెట్ తో నిర్మాణంలోకి రాబోతున్న ఈ సినిమా కోసం మొదట సూర్యను హీరోగా ఎంపిక చేయాలని నిర్ణయించారు. కానీ అనుకోని కారణాల వల్ల సూర్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో, శివకార్తికేయన్ ప్రధాన పాత్రలోకి వచ్చాడు. ఇది శివకార్తికేయన్ కెరీర్‌లో అతని 25వ సినిమాగా నిలవనుంది. ఈ ప్రాజెక్ట్ పై ఆయన కూడా చాలా ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు.

ఇక ప్రధాన విలన్ పాత్రకు మొదట తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ పేరు వినిపించింది. అయితే లోకేష్ సినిమా నుంచి తప్పుకోవడంతో, మలయాళ నటుడు రోషన్ మాత్యు ను విలన్ గా తీసుకున్నారు. ఈ కాస్టింగ్ మార్పులతో సినిమా మరింత ఆసక్తికరంగా మారింది. ఇక సినిమా రెగ్యులర్ షూట్ వచ్చే జనవరి నెలలో ప్రారంభం కానుంది. శివకార్తికేయన్ 25వ సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక సినిమా శివకార్తికేయన్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలవాలని దర్శకురాలు సుధా కొంగర భావిస్తున్నారు. మొత్తం మీద, పురాణనూరు తమిళ ఇండస్ట్రీతో పాటు పాన్ ఇండియా స్థాయిలో కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకునేలా ఉంటుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.


Recent Random Post: