
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల టాలీవుడ్‌కు కొంత దూరంగా ఉంటూ, బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో బిజీగా మారింది. ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించిన సమంత, అక్కడే మరో రెండు సినిమాలకు సైన్ చేసినట్టు సమాచారం. కానీ సమంత తెలుగులో అవకాశాలు రాకపోవడమా, లేక తానే తెలుగులో నటించేందుకు ముందుకు రాకపోవడమా అన్నది ఇంకా స్పష్టత లేదు.
గత ఏడాది అలియా భట్ నటించిన ‘జిగ్రా’ సినిమా తెలుగు ప్రమోషన్ల సందర్భంగా దర్శకుడు త్రివిక్రం, సమంతను తెలుగులో ఎక్కువ సినిమాల్లో చూడాలని చెప్పి ఆశీర్వదించారు. దానికి సమంత కూడా, “మీరు రాస్తే నేను నటిస్తా” అని సమాధానం ఇచ్చింది. అయితే, త్రివిక్రం మాత్రం ‘గుంటూరు కారం’ తర్వాత కొత్త ప్రాజెక్ట్‌లలో సమంతను ఇంకా తీసుకోవడంలేదు.
‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అ ఆ’ వంటి చిత్రాల్లో త్రివిక్రం దర్శకత్వంలో నటించిన సమంతకు మంచి అవకాశాలు రావడానికి త్రివిక్రం ఒక కీలక పాత్ర పోషిస్తారని అనుకున్నారు. సమంతను త్రివిక్రం మర్చిపోలేదని, సరైన పాత్ర కోసం ఎదురుచూస్తున్నాడని టాక్. సమంత కూడా దక్షిణ సినీ రంగంలో నటించేందుకు సిద్ధంగానే ఉన్నప్పటికీ, త్రివిక్రం నుంచి ఆఫర్ వస్తుందా లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.
‘ఖుషి’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సమంత, నిర్మాతగానూ సక్సెస్ సాధించాలనే ప్రయత్నంలో ఉంది. ఆమె నిర్మించిన ‘శుభం’ సినిమా విజయంతో స్ఫూర్తి పొంది, ఇప్పుడు నటిగానే కాకుండా నిర్మాతగా కూడా తన పంథాను కొనసాగించాలనుకుంటోంది.
తెలుగులో అవకాశాలు కరువవుతున్నట్లు భావిస్తున్న సమంత, త్రివిక్రం లాంటి దర్శకులు కూడా తనను పరిగణలోకి తీసుకోవడం లేదని ఫీల్ అవుతోంది. అయితే, బాలీవుడ్‌లో ‘ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్’ వంటి వెబ్ సిరీస్‌లతో స్టార్ రేంజ్‌కు చేరిన సమంత, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో తన కొత్త కోణాన్ని చూపించగలిగింది. ఫ్యాన్స్ మాత్రం సమంతను వెబ్ సిరీస్‌లలో మాత్రమే కాకుండా సినిమాలలోనూ మరింత మెరిపించాలనుకుంటున్నారు.
Recent Random Post:















