
సాయి పల్లవి అంటే ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉన్న నటి. ఆమె నటనా ప్రతిభ, డాన్స్ స్కిల్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండి, డీసెంట్ క్యారెక్టర్లతోనే ప్రేక్షకులను మెప్పించటం ఆమె ప్రత్యేకత. ఈ రేర్ క్వాలిటీకి కూడా ఆమెకు విశేషమైన అభిమానులు ఉన్నారు.
ఇండస్ట్రీలోనూ సాయి పల్లవికి మంచి గౌరవం ఉంది. మెగాస్టార్ చిరంజీవి నుంచి తరం తరం హీరోల వరకు ఆమెకు ప్రత్యేకమైన అభిమానమే. అయితే, చిరంజీవి సినిమాలో నటించే అవకాశం వచ్చినా, చెల్లెలు పాత్ర కావడంతో సాయిపల్లవి ఆ ఛాన్స్‌ను సున్నితంగా తిరస్కరించిందట. మెగాస్టార్ సరసన నటించాలంటే డ్యాన్స్ పోటీ చేసే స్థాయిలో ఉండాలి అనే ఆలోచనతో ఆ పాత్రను వదులుకున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సాయి పల్లవి, తన డాన్స్ స్పూర్తిగా మెగాస్టార్‌ను పేర్కొంది. “చిన్నప్పుడు ‘ముఠా మేస్త్రీ’ సినిమా పదే పదే చూసేదాన్ని. అందులో చిరంజీవి గారి డాన్స్‌ను చూసి పూర్తిగా ఫిదా అయిపోయాను. అప్పటినుంచి డాన్స్షోలలో పాల్గొనాలని అనిపించింది. ఒకసారి ఈవెంట్లో ఆయన్ను కలవడం, ఆయనతో స్టేజ్‌పై డాన్స్ చేయడం నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి. ఆయన్ను చూస్తుంటే ఓ ప్రత్యేకమైన ఎనర్జీ ఫీలవుతుంది” అని చెప్పింది.
ఈ మాటలతో సాయి పల్లవి తన డాన్స్‌లో చిరంజీవి ఎంతటి ప్రేరణగా నిలిచారో బయటపెట్టింది. నటనతో పాటు డాన్స్‌లోనూ తానే సుప్రీం అనిపించుకున్న సాయి పల్లవి, మెగాస్టార్‌ను తన గురువుగా భావించడం అభిమానులకు మరింత ముచ్చటగా మారింది.
Recent Random Post:















