
సమంత ఓవైపు మయోసైటిస్కు చికిత్స పొందుతూనే, మరోవైపు తన కెరీర్‌ను కొనసాగిస్తూ సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్‌లో యాక్షన్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంది. క్లిష్టమైన స్టంట్స్‌తో అదరగొట్టిన సమంతకు, ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. ప్రియాంకా చోప్రా నటించిన సిటాడెల్ మాతృక కంటే, భారతీయ రీమేక్‌లో సమంత నటనకు మరింత గుర్తింపు దక్కడం గమనార్హం.
ఇప్పుడామెకు మరో గౌరవం దక్కింది. సిటాడెల్: హనీ బన్నీలో తన అద్భుతమైన నటనకు గాను సమంత ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. న్యూస్18 షోషా రీల్ అవార్డ్స్ 2025 ఉత్సవంలో ఈ అవార్డును అందుకున్న సమంత ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది. తన కృషికి తగిన గుర్తింపు లభించిందనే సంతృప్తి ఆమె కళ్లలో స్పష్టంగా కనిపించింది.
ఈ అవార్డుకు పోటీలో హీరామండిలో నటించిన మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావు హైదరి, అలాగే కిల్లర్ సూప్ కోసం కొంకణా సేన్ శర్మ కూడా నామినేట్ అయ్యారు. కానీ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు చివరికి సమంతను వరించింది. రాజ్ & డికే దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్‌లో ఆమె వరుణ్ ధావన్ సరసన కీలక పాత్ర పోషించింది. ఇందులో సమంత అత్యంత ప్రమాదకరమైన రహస్య మిషన్‌లో భాగంగా ఓ పవర్ఫుల్ ఏజెంట్ పాత్రలో అదరగొట్టింది.
ప్రస్తుతం సమంత బిజీ షెడ్యూల్‌తో ఉన్నారు. నిర్మాతగా మారిన ఆమె, ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే చిత్రంపై దృష్టి సారించింది. అంతేకాకుండా, రాజ్ & డికే నిర్మిస్తున్న రక్త్ బ్రహ్మండ్ అనే ప్రాజెక్ట్‌లో కూడా కీలక పాత్ర పోషించనున్నారు. సినిమా, డిజిటల్ ఎంటర్టైన్మెంట్ రెండింటిలోనూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న సమంతకు, ఈ అవార్డు ఆమె కెరీర్లో మరో మైలురాయిగా నిలిచింది.
Recent Random Post:















