సిద్దార్థ్ హిపోక్రసీపై నెటిజన్ల ట్రోలింగ్!

Share


సిద్దార్థ్ కెరీర్ గత కొంత కాలంగా ఆశించినట్లుగా సాగలేదు. ‘చిన్నా’ సినిమాతో కొంతమేర ప్రశంసలు అందుకున్నా, ఆ తర్వాత వచ్చిన సినిమాలే ఆ స్థాయిలో ఫలితాలు రాలేదు. ఈ నేపథ్యం లో, సిద్దార్థ్ తన బాధను పలు సందర్భాలలో పంచుకున్నాడు. ఇండస్ట్రీ, ఆడియన్స్ పై పరోక్షంగా సెటైర్లు కూడా వేయడం మొదలు పెట్టాడు.

అలాగే, కమర్షియల్ సినిమాల్లో నటించడానికి అవకాశాలు వచ్చినప్పటికీ, “సమాజానికి సందేశాన్ని ఇవ్వడం” అనే కారణంతో వాటిని వదిలేశాడని పేర్కొన్నాడు. అసభ్య సన్నివేశాలతో సినిమాలు వచ్చినప్పటికీ, వాటిని ఆపివేసినట్లు వెల్లడించాడు.

తరువాత, సిద్దార్థ్ తన పాత సినిమాలను దృష్టిలో ఉంచుకుని, “నేను ఉత్తముడినే” అన్నట్లుగా వ్యాఖ్యానించడం నెటిజన్లను అసంతృప్తిపర్చింది. ఈ క్రమంలో, సిద్దార్థ్ గతంలో చేసిన రొమాంటిక్ సన్నివేశాలను ట్రోల్స్ గా మార్చి, ఇప్పుడు ఆయనను హిపోక్రేట్ గా ట్రోల్ చేస్తున్నారు. ‘ఆట’ సినిమాలో ఇలియానాతో చేసిన రొమాంటిక్ సన్నివేశం, ‘గృహం’ మరియు ‘నువ్వొస్తానంటే నొన‌ద్దాంటానా’ వంటి చిత్రాలలోని సన్నివేశాలు ఇప్పుడు నెటిజన్ల చర్చలోకి వచ్చినాయి.

ఇలా సిద్దార్థ్ ఇప్పుడు తన గతాన్ని మర్చిపోయాడని నెటిజన్లు విమర్శిస్తూ, అతని తాజా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆసక్తికర పోస్టులు చేస్తున్నారు.


Recent Random Post: