సూర్య 47లో మలయాళ నటుడు నస్లెన్ కీలక పాత్రలో!

Share


కొలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస ఫ్లాపులను ఎదుర్కొంటున్నప్పటికీ, వాటి వల్ల ఎలాంటి నిరుత్సాహం లేకుండా తన కెరీర్‌లో ముందుకు సాగుతున్నారు. ఈ ఏడాది వచ్చిన రెట్రో మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా, సూర్య వెంటనే తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆయన వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని చేస్తున్నారు, అలాగే ఆర్.జె. బాలాజీ దర్శకత్వంలో కరుప్పు అనే సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన మొదటి పాటను కూడా విడుదల చేశారు.

ఇక సూర్య 47వ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. జీతూ మాధవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించబోతున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు నస్లెన్ కే. గఫూర్ కీలక పాత్రలో నటించనున్నారని సమాచారం. నస్లెన్ ప్రేమలు చిత్రంతో సౌత్ ప్రేక్షకులకు బాగా పరిచయమయ్యాడు.

ఈ చిత్రంలో నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా, ఫహద్ ఫాజిల్ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారని టాక్. ఫహద్ విలన్‌గా కనిపించవచ్చని కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించడంతో, కీ రోల్స్‌లో మలయాళ నటులను ఎక్కువగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

ఇక సూర్య ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ఇది ఒక ఇంటెన్స్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుండగా, డిసెంబర్ నుండి షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

మరోవైపు, నస్లెన్ వరుసగా మలయాళ సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల వచ్చిన కొత్త లోక చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్‌ని ఇష్టపడే సన్నీ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు సూర్య 47 సినిమాలో భాగమవ్వడం అతని కెరీర్‌లో మరో ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.


Recent Random Post: