స్టేజ్ ఏదైనా..భాష ఏదైనా ఎన్టీఆర్ తో ఇట్లుంటది!

యంగ్ టైగర్ ఎన్టీఆర్..ఈతరం నటుల్లో మనకున్న మాస్టర్ పీస్ అని చెప్పక తప్పదు. రాజమౌళి అన్నట్టుగా తన కను బొమ్మ కూడా హావ భావాలు పలికిస్తుంది. ఇది ప్రతీ ఒక్కరూ యునానిమస్ గా అంగీకరించే విషయం. నటన పరంగానూ అద్భుతమైన రోమాంచితమైన డైలాగ్ లని పలకడంలోనూ ఎన్టీఆర్ కు సాటి ఎవరు లేరన్నది సుస్పష్టం. వేదిక ఏదైనా.. భాష ఏదైనా అక్కడున్న ప్రేక్షకుల్ని రంజింప జేయడమే కాకుండా తనదైన ప్రత్యేకతతో దుమ్ముదులిపేయడం ఎన్టీఆర్ ప్రత్యేకత.

‘RRR’తో విశ్వ వ్యాప్తంగా హ్యూజ్ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. తాజాగా జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ‘RRR’ ఒరిజినల్ సాంగ్ విభాగంలో చంద్రబోస్ రాయగా ప్రేమ్ రక్షిత్ డ్యాన్స్ కంపోజ్ చేసిన ‘నాటు నాటు’సాంగ్ కు గానూ ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం లభించింది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ బెస్ట్ ఒరిజినల్ మ్యూజిక్ విభాగాల్లో పోటీపడిన ‘RRR’ ఫైనల్ గా బెస్ట్ ఒరిజినల్ మ్యూజిక్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని దక్కించుకుని ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఈ సందర్బంగా అవార్డు ఫంక్షన్ వేదికగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అమెరికల్ యాక్సెంట్ లో అదరగొట్టేశాడు. ఓ అమెరికన్ మీడియా పర్సన్ అడిగిన పలు ప్రశ్నలకు ఎన్టీఆర్ లిటిల్ బిట్ యాటిట్యూడ్ ని ప్రదర్శిస్తూ అమెరికన్ యాక్సెంట్ లో దుమ్ముదులిపేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారి సందడి చేస్తోంది.

అంతే కాకుండా ఆ వీడియోకు తెలుగు తమిళ కన్నడ హిందీ జపనీస్ భాషల్లో ఎన్టీఆర్ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ లని జత చేసి ఫ్యాన్స్ ఓ వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అది ఇప్పుడు నెట్టింట వైరల్ గా ట్రెండ్ అవుతూ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు మన భాషలతో పాటు ఫారిన్ లాంగ్వేజ్ లపై వున్న పట్టుకు ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు ఫిదా అయిపోతూ నెట్టింట ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కించుకున్న’RRR’ త్వరలో జరగనున్న ఆస్కార్ అకాడమీ అవార్డులకు నామినేట్ అయిన విషయం తెలిసిందే. మార్చిలో జరగనున్న ఆస్కార్ అవార్డుల్లోనూ ‘RRR’ సత్తా చాటితే యావత్ ఇండియా ‘RRR’ టీమ్ పై ప్రశంసల వర్షం కురిపించడం ఖాయం అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.


Recent Random Post: