
‘యానిమల్’ సినిమాతో దర్శకుడు సందీప్ వంగా మళ్లీ తన స్థాయిని మరోసారి నిరూపించుకున్నాడు. కేవలం మూడు సినిమాలతోనే తన డైరెక్షన్‌కి ప్రత్యేకమైన రేంజ్ తీసుకొచ్చాడు. అప్పట్లో ఆర్జీవి వచ్చినప్పుడు ఎలా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించారో, ఇప్పుడు అదే స్థాయిలో సందీప్ సినిమాల గురించి, ఆయన దర్శకత్వం గురించి మాట్లాడుతున్నారు. అర్జున్ రెడ్డి నుండి యానిమల్ వరకు ఆయన క్రియేటివ్ విజన్ పీక్స్‌కి వెళ్లిపోయింది.
ప్రస్తుతం ప్రభాస్‌తో “స్పిరిట్” సినిమాకి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ తర్వాత సందీప్‌తో సినిమా చేయాలని ఎంతో మంది స్టార్ హీరోలు లైన్లో ఉన్నారు. మొదట అల్లు అర్జున్‌తో సినిమా చేసే ఆలోచన ఉండగా, ఇప్పుడు ఆ స్థానంలో రామ్‌చరణ్ వచ్చే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. అలాగే విజయ్ దేవరకొండతో కూడా ఒక సినిమా చేసే ప్లాన్‌లో ఉన్నాడట.
యానిమల్ ఈవెంట్లోనే సూపర్‌స్టార్ మహేష్ బాబు, సందీప్ దర్శకత్వం గురించి ప్రత్యేకంగా మాట్లాడిన విషయం తెలిసిందే. అందువల్ల మహేష్ – సందీప్ కాంబినేషన్ తప్పకుండా ఎప్పుడో ఒకరోజు కుదురుతుందని ఫిలింనగర్లో చర్చ జరుగుతోంది. అప్పట్లో ఈ కాంబో కోసం “షుగర్ ఫ్యాక్టరీ” అనే టైటిల్ కూడా వినిపించింది. కొంత ఆలస్యమైనా ఈ కాంబో ఒకరోజు కచ్చితంగా సెటిల్ అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు.
సందీప్ వంగా మెగాస్టార్ చిరంజీవి హార్డ్‌కోర్ ఫ్యాన్ అన్న సంగతి తెలిసిందే. చిన్నప్పటి నుండి చిరంజీవి సినిమాలు చూసి దర్శకుడిగా మారాలన్న ప్యాషన్ పెంచుకున్నాడట. తన ఆఫీస్‌లో కూడా చిరంజీవి ఫోటోని గౌరవంగా పెట్టుకున్నాడు. ఫ్యాన్స్ ఆశించే మరో డ్రీమ్ కాంబో ఇదే – ఒక మంచి కథతో సందీప్ వంగా – చిరంజీవి సినిమా వస్తే, బాక్సాఫీస్ హడావిడి కాకుండా షేక్ అయ్యే అవకాశం ఖాయం.
మొత్తానికి స్పిరిట్ తర్వాత సందీప్ వంగా ఏ సినిమా చేస్తాడు? ఎవరితో చేస్తాడు? అనే ప్రశ్నకు అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ కాంబినేషన్స్ ఫైనల్ అయితే ఇండస్ట్రీనే షివర్ అయ్యే టైమ్ వచ్చేలా ఉందని చెప్పవచ్చు.
Recent Random Post:














