స్పిరిట్ రూమర్స్‌కు ప్రకాష్ రాజ్ ఫుల్ స్టాప్

Share


సందీప్ రెడ్డి వంగా – ప్రభాస్ కాంబినేషన్‌పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘స్పిరిట్’ మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచే సోషల్ మీడియాలో ఏదో ఒక అప్‌డేట్ వైరల్ అవుతూనే ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలోని కాస్టింగ్ విషయంలో రకరకాల ఊహాగానాలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్న సమయంలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ బయటకు వచ్చింది.

పెద్ద సినిమాల చుట్టూ గాసిప్స్ రావడం సహజమే. కానీ కొన్ని సందర్భాల్లో అవే హద్దులు దాటి నెగెటివ్ ప్రచారంగా మారుతాయి. గత కొన్ని రోజులుగా ‘స్పిరిట్’ సెట్స్‌లో గొడవలు జరిగాయి, ఒక స్టార్ నటుడు సినిమా నుంచి తప్పుకున్నాడన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ హడావుడి చేశాయి. దర్శకుడికి, నటుడికి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయంటూ రకరకాల కథనాలు ప్రచారం కావడంతో అభిమానులు కూడా కన్ఫ్యూజన్‌లో పడ్డారు.

ఈ రూమర్స్‌పై తాజాగా నటుడు ప్రకాశ్ రాజ్ స్వయంగా స్పందించి క్లారిటీ ఇచ్చారు. తనకు సంబంధించి వైరల్ అయిన వార్తలను ఆయన పూర్తిగా ‘ఫేక్ న్యూస్’ అంటూ కొట్టిపారేశారు. అసలు తన సీన్స్ షూటింగ్ ఇంకా ప్రారంభమే కాలేదని, అలాంటప్పుడు తాను సినిమా నుంచి ఎగ్జిట్ అయ్యానని వార్తలు ఎలా వస్తాయంటూ తీవ్రంగా మండిపడ్డారు. వాట్సాప్ ఫ్యాక్టరీల్లో ఇలాంటి కట్టుకథలు తయారు చేయడం మానుకోవాలని చురకలంటించారు. ఆయన ఇచ్చిన స్పష్టతతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్టయింది. ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సెట్స్‌లో గొడవలు జరిగాయన్నా, తీవ్రమైన టెన్షన్స్ ఉన్నాయన్నా వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన మాటలతో స్పష్టమైంది. ప్రభాస్ లాంటి బిగ్ స్టార్ సినిమాలో ప్రకాష్ రాజ్ వంటి పవర్‌ఫుల్ నటుడు ఉండటం సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.

ఇప్పటి వరకు ఈ రూమర్స్‌పై మేకర్స్ కూడా అధికారికంగా స్పందించలేదు. అయితే షూటింగ్ పూర్తిగా ట్రాక్‌లోనే సాగుతోందని, షెడ్యూల్స్ ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయని సమాచారం. ప్రకాష్ రాజ్ సీన్స్ కూడా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రభాస్‌ను ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మొత్తానికి ‘స్పిరిట్’ సినిమా చుట్టూ నెలకొన్న హైప్ చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు ఖాయమనిపిస్తున్నాయి. ప్రకాష్ రాజ్ ఇచ్చిన రియాక్షన్‌తో నెగెటివ్ ప్రచారానికి బ్రేక్ పడింది. వచ్చే ఏడాది ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ థియేటర్లలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్ర ఏ రేంజ్‌లో ఉండబోతుందో చూడాలి.


Recent Random Post: