
పాప్ కల్చర్ అనేది పాశ్చాత్య దేశాలకే పరిమితం అనుకునేవాళ్లలో, తెలుగమ్మాయి గాయన స్మిత నిరూపించారు, పాప్ స్టైల్ కేవలం వెస్ట్రన్ కాదు, భారతదేశంలోని పల్లె పల్లె వరకు మార్మోగే ఇండో-వెస్ట్రన్ స్టైల్ అని. దాదాపు 20 ఏళ్ల క్రితం, స్మిత విడుదల చేసిన రీమిక్స్ సాంగ్ “మసక్ మసక్ చీకటిలో” ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలుసు. ఆ పాట అప్పట్లో చార్ట్ బస్టర్ హిట్లో ఒకటిగా నిలిచింది.
ఇటీవల, స్మిత తన సూపర్ హిట్ సాంగ్‌ని రీబూట్ చేస్తూ అభిమానులకు సూపర్ గుడ్ న్యూస్ ఇచ్చారు. “మసక్ మసక్” కొత్త వెర్షన్ను బిగ్ బాస్ వేదికపై లాంచ్ చేశారు. ఈ పాటకు విజయ్ బిన్ని దర్శకత్వం వహించగా, నోయల్-స్మిత జంట డ్యాన్స్ చేసింది. స్మిత మాట్లాడుతూ, “ఇంకా మ్యూజిక్ ఆల్బమ్స్ తో మళ్లీ అభిమానుల ముందుకు వస్తాను” అని తెలిపారు. గాయనిగా మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేశారు.
ఎందుకు నటిగా కొనసాగించలేదనే ప్రశ్నకు స్మిత సమాధానం చెప్పారు. “చాలా కాలం క్రితం మల్లీశ్వరి సినిమాలో, ఆ తర్వాత నాగార్జున కింగ్లో నటించాను. కానీ దర్శకులు మనకు చెప్పేది ఒకటి, ఆ తర్వాత నిజానికి చేయించేది ఇంకోటి. అందుకే నటించడం నిలిపేశాను. మల్లీశ్వరిలో నా పాత్ర మిస్ ఫైర్ అయింది. ఆ తర్వాత నటించకూడదని నిర్ణయించుకున్నాను” అని వివరించారు.
వ్యక్తిగత జీవితానికి వస్తే, స్మితకు ఒక కుమార్తె ఉంది. ప్రస్తుతం గాయనిగా తిరిగి బిజీ అవ్వాలని ప్రయత్నాల్లో ఉన్నారు. వర్సుగా ఆల్బమ్స్ ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటానని తెలిపారు. కొంత గ్యాప్ తరువాత మీడియా ముందుకు వచ్చి, మునుపటి కంటే మరింత స్లిమ్ గా, ఆకట్టుకునే లుక్లో కనిపిస్తున్నారు. సినిమాలతో పాటు బిజినెస్ విమెన్గా కూడా స్మిత తెలుగు సర్కిల్స్‌లో పాపులర్ అయ్యారు.
Recent Random Post:















