
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీ హరిహర వీరమallu టాలీవుడ్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నో సంవత్సరాలుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం చివరకు జూలై 24న విడుదలకు సిద్ధమవుతోంది. మెగా అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది.
ఇలాంటి హైప్ ఉన్న సినిమాకు టికెట్ ధరలు ఎలా ఉంటాయన్నదే ఇప్పుడు ట్రేడ్ సర్కిల్స్‌లో చర్చ. గతంలో పెద్ద సినిమాలకు స్పెషల్ పెర్మిషన్ తీసుకుని టికెట్ ధరలు పెంచిన సందర్భాలు ఉన్నాయి. అదే దారిలో హరిహర వీరమల్లు నిర్మాతలు కూడా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం స్పెషల్ రేట్లకు ప్రభుత్వ అనుమతికి మేకర్స్ వెయిట్ చేస్తున్నారు.
ఇప్పటివరకు లీకైన వివరాల ప్రకారం, ఏపీలో సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్ ధర రూ.236, మల్టీప్లెక్స్‌లలో రూ.295 వరకు ఉండొచ్చని అంటున్నారు. తెలంగాణలో అయితే రేట్లు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అక్కడ సింగిల్ స్క్రీన్ టికెట్ ధర రూ.265.50గా, మల్టీప్లెక్స్ ధర రూ.413గా నిర్ణయించనున్నారు. అయితే ఇవన్నీ అధికారికంగా ప్రభుత్వం నుండి GO వచ్చిన తర్వాతే ఫిక్స్ అవుతాయి.
ఇప్పటివరకు మేకర్స్ అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కానీ ట్రేడ్ వర్గాలు ఈ వివరాలను ఖచ్చితంగా భావిస్తున్నాయి. పవన్ సినిమాలకు ఉన్న మాస్ క్రేజ్, పవన్ లుక్, భారీ యాక్షన్ విజువల్స్, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అన్నీ కలిపి టికెట్ రేట్ల పెంపు సహజమేనని భావిస్తున్నారు.
ఫస్ట్ డే ఏ రేటైన ఫ్యాన్స్ ఎగబడతారు అనడంలో సందేహమే లేదు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతవరకు స్పందిస్తారో చూడాలి. అధికారిక GO వచ్చిన తర్వాత మేకర్స్ పూర్తి వివరాలు ప్రకటించనున్నారు. మొత్తానికి టికెట్ ధరల చర్చతో హరిహర వీరమల్లుపై మరింత హైప్ పెరిగినట్టే!
Recent Random Post:















