హరిహర వీరమల్లు పబ్లిసిటీ భారాన్ని మోస్తున్న నిధి!

Share


సాధారణంగా హీరోయిన్లు ప్రమోషన్స్లో ఎంతగా పాల్గొన్నా ఒక స్థాయిలోనే ఆగిపోతారు. కానీ నిధి అగర్వాల్ మాత్రం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకి కాస్త ఎక్కువగానే కష్టపడుతోంది. పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలతో బిజీగా ఉండటంతో ప్రమోషన్స్ బాధ్యత అంతా నిధి భుజాల మీదే పడింది. దీంతో ఆమె ఎనర్జీతో ఒకే రోజు 15కి పైగా మీడియా ఇంటర్వ్యూలు చేయడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం.

ఇంతగా శ్రమించడానికి గల కారణం కూడా నిధికే తెలిసిన కథ. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆమెకు పెద్ద హిట్లు లేవు. ప్రస్తుతం చేతిలో ఉన్న హరిహర వీరమల్లు, ది రాజా సాబ్ సినిమాలపైనే నిధి భవిష్యత్ ఆధారపడింది. హరిహర వీరమల్లు హిట్ అయితే నిధి కెరీర్ మళ్లీ ట్రాక్ మీద పడే అవకాశం ఉంది. పైగా ఈ సినిమాలో తన పాత్ర పెద్దదే అని, పార్ట్ 2కి సంబంధించిన 20 శాతం షూటింగ్ పూర్తయ్యిందని కూడా నిధి చెప్పింది.

పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ అవ్వడం నిధికి క్రేజీ ప్లస్ కావొచ్చునే కానీ, ఫలితమే కీలకం. హైదరాబాద్‌లో ఉండే నిధికి గ్లామర్ షో చేసే అవకాశాలు హరిహర వీరమల్లులో లేవు. కానీ దర్శకుడు జ్యోతికృష్ణ తన పాత్రను గ్రేస్‌ఫుల్‌గా చూపించారని చెప్పింది. జూలై 21న హైదరాబాద్‌లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిధి ఏ విధంగా స్పీచ్ ఇస్తుందో, సినిమా హైప్ పెంచుతుందో చూడాలి. ప్రస్తుతం మెయిన్ కాస్ట్ అందుబాటులో లేకపోవడంతో పబ్లిసిటీ మొత్తం నిధి ఒంటరి భుజాల మీదే ఉంది.


Recent Random Post: