హరిహర వీరమల్లు రిలీజ్ కు రెడీ: జ్యోతి కృష్ణ ఎమోషనల్ కామెంట్స్

Share


టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’ మూవీ విడుదలకు రెడీ అయింది. మొగల్ సామ్రాజ్య కాలం నాటి ఔరంగజేబు నేపథ్యంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా జూలై 25న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు. తాజాగా నిర్వహించిన గ్రాండ్ ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్, డైరెక్టర్ జ్యోతి కృష్ణ, హీరోయిన్ నిధి అగర్వాల్ సహా చిత్ర బృందం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ జ్యోతి కృష్ణ మాట్లాడుతూ, “క్రిష్ గారు మొదట సినిమా ప్రారంభించగా, కొన్ని కారణాల వల్ల నేను డైరెక్షన్ బాధ్యతలు చేపట్టాను. పవన్ కళ్యాణ్ గారిని తెరపై మళ్లీ చూడాలని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ కోరిక తీరనుంది” అన్నారు.

అలాగే, “వీఎఫ్ఎక్స్ పనులు చివరి దశలో ఉన్నాయి. పవన్ సర్ మీద ప్రత్యేకంగా 18-20 నిమిషాల సీన్ డిజైన్ చేశాం. ఆ ఫైట్ సీక్వెన్స్ కోసం కీరవాణి గారికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చెయ్యటానికి 10 రోజులు పట్టింది. ఆ సీన్ ఫైనల్ మిక్స్ చేయడానికి ఎనిమిది గంటలు పట్టింది. సీన్ చూసాక అసలైన పవన్ కళ్యాణ్ ఎనర్జీ బయటపడింది. మేము 17వ శతాబ్దం మోగల్ స్టోరీని తెరపైకి తీసుకువస్తున్నాం. పవన్ కళ్యాణ్ – పవర్ ఫుల్ రూలర్ మధ్య యుద్ధమే కథాంశం.” అని వివరించారు.

“సినిమా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక్క రోజూ రిలాక్స్ అవ్వలేదు. మా నాన్న ఏఎం రత్నం గారు ఆరోగ్య సమస్యలు ఉన్నా పట్టించుకోకుండా కసిగా పని చేశారు. నా డెడికేషన్ మొత్తం పెట్టాను. 10 రోజులుగా అందరం నిద్రలేకుండా పని చేస్తున్నాం. కీరవాణి గారు every frame కి elevation ఇచ్చారు. ఫ్యామిలీస్ తో వెళ్లి సినిమా చూడొచ్చని భావిస్తున్నా” అని జ్యోతి కృష్ణ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ‘హరిహర వీరమల్లు’ ఎంత భారీ హిట్ అవుతుందో చూడాలి.


Recent Random Post: