హీరో అంత పెద్ద త‌ప్పు చేసాడా?

సినిమా కోసం….స‌న్నివేశం డిమాండ్ చేసిన స‌న్నివేశంలో హీరో-హీరోయిన్లు-న‌టీన‌టులు ఎవ‌రైనా ద‌ర్శ‌కు డు చెప్పిన‌ట్లు చేయాల్సిందే. ఏ క‌థ‌నైనా న‌టీన‌టులు కెప్టెన్ ఆఫ్ ది షిప్ కోణంలో చూడాల్సి ఉంటుంది. ద‌ర్శ‌కుడు కోరుకున్న విధంగా న‌టీంచ‌డమే న‌టీన‌టులు ప‌ని. ఒక్కో సంద‌ర్భంలో ద‌ర్శ‌కుడు సైతం బార్డర్ దాటిన‌ట్లు అనిపించొచ్చు. కానీ అది కూడా సీన్ డిమాండ్ చేసిన స‌మయంలో అలాంటి స‌రిహ‌ద్దులు దాటాల్సి ఉంటుంది.

తాజాగా `యానిమ‌ల్` సినిమా కోసం ర‌ణ‌బీర్ క‌పూర్ చాలా త‌ప్పులు చేసాన‌ని.. ఆ త‌ప్పులు వెనుక ఉన్న‌ది త‌న భార్య అలియాభ‌ట్ అని ఇంట్రెస్టింగ్ విష‌యాలు రివీల్ చేసాడు. ఇటీవ‌ల రిలీజ్ అయిన `యాన‌మిల్` ట్రైల‌ర్ ఏ రేంజ్ లో స‌క్సెస్ అయిందో తెలిసిందే. ఫాద‌ర్-స‌న్ సెంటిమెంట్ తో తెర‌కెక్కిన సినిమాలో ఇద్ద‌రి మ‌ధ్య ఎమోష‌న్ ని నెక్స్ట్ లెవ‌ల్లో చూపించారు. అలాగే ఇందులో ర‌ణ‌బీర్ భార్య పాత్ర‌లో ర‌ష్మిక మంద‌న్న న‌టించింది. ర‌ష్మిక‌తోనూ ఘాటైన స‌న్నివేశాలున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఓ ఇంట‌ర్వ్యూలో ర‌ణ‌బీర్ ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించాడు. ‘అలియా..నేను ఏ సినిమా చేసినా అందులో పాత్ర‌ల గురించి చ‌ర్చించుకుంటాం. ఒక న‌టుడిగా ఆమె అభిప్రాయ్ని ఎంతో గౌర‌విస్తా. యానిమ‌ల్ చేసే ట‌ప్పుడు కొన్ని స‌న్నివేశాలు త‌ప్పుగా అనిపించేవి. అలా చేయ‌డం క‌రెక్టేనా? అని నాకే అనిపించింది. తెలియ‌ని బాధ క‌లిగేది. ఆ స‌మ‌యంలో నువ్వు చేస్తోంది సినిమాలో పాత్ర మాత్ర‌మే. నిజ జీవితంలోనూ..నీ వ్య‌క్తిగ‌త జీవితంలోనూ కాదు.

ఆ పాత్ర రాయ‌డం వెనుక చాలా ఆలోచ‌న‌లు.. అంశాలుంటాయ‌ని అలియా ధైర్యంచెప్పింది. ఆ మె ధైర్యంతో సినిమాలో చాలా స‌న్నివేశాలు ఈజీగా పూర్తి చేయ‌గ‌లిగాను` అని అన్నారు. ర‌ణ‌బీర్ సినిమాలో అంత పెద్ద త‌ప్పు ఏం చేసాడు? అన్న‌ది రిలీజ్ త‌ర్వాత తెలుస్తుంది. ర‌ణ‌బీర్ పెర్పార్మెన్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. బాలీవుడ్ లో న‌టుడిగా ఆయ‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. మ‌హేష్ సైతం ర‌ణ‌బీర్ కి వీరాభిమాని అన్న సంగ‌తి తెలిసిందే.


Recent Random Post:

Karimnagar : సంజయ్‌కి దమ్ముంటే కాంగ్రెస్‌ టికెట్‌పై గెలవాలి | MLA Padi Kaushik Reddy F2F

January 12, 2025

Karimnagar : సంజయ్‌కి దమ్ముంటే కాంగ్రెస్‌ టికెట్‌పై గెలవాలి | MLA Padi Kaushik Reddy F2F