11ఏళ్ల కాజోల్‌ సాహసం – అమ్మమ్మ కోసం స్కూల్‌ నుంచి పరార్!

Share


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ తన బాల్యంలో చేసిన ఓ సాహసాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. చదువుకుంటున్న రోజుల్లో తన అమ్మమ్మపై ఉన్న ప్రేమ వల్ల తాను ఓసారి ప్రమాదకర నిర్ణయం తీసుకున్నానని ఆమె తెలిపారు.

తాను బోర్డింగ్ స్కూల్లో చదువుతుంటే ఒకసారి అమ్మమ్మ ఆరోగ్యంగా లేరన్న వార్త విన్నానని చెప్పిన కాజోల్, అప్పటి భావోద్వేగాలను పంచుకున్నారు. “అమ్మమ్మంటే నాకు చాలా ఇష్టం. ఒకసారి స్కూల్ డేస్‌లో ఆమె ఆరోగ్యం బాగోలేదని తెలిసింది. వెంటనే ఇంటికి వెళ్లాలని అనిపించింది. కానీ అమ్మకు ఫోన్ చేయగా, పరీక్షలు ఉండటం వల్ల ఇంటికి రావద్దని చెప్పింది. డిసెంబర్‌లో సెలవులు ఇస్తామన్నారు. కానీ నాకు అక్కడే ఉండటం అస్సలు మనసుకు ఇంపట్లేదు,” అని ఆమె చెప్పింది.

ఆ సమయంలో ఆమె ఫ్రెండ్ కూడా ఓ వ్యక్తిగత సమస్యతో బాధపడుతుండడంతో, ఇద్దరూ కలిసి స్కూల్‌ నుంచి పారిపోవాలని నిర్ణయించుకున్నారట. స్కూల్ నుంచి బయటకు వచ్చిన కాజోల్, అదే టౌన్‌లో ఉన్న మామయ్యను కలిసిందట. అతని ఫోన్ ద్వారా అమ్మను సంప్రదించి, బస్టాండ్‌కి తీసుకెళ్లమని అడిగిందట. మామయ్య కూడా నమ్మి తీసుకెళ్లగా, అక్కడే అనుకోని మలుపు చోటు చేసుకుంది.

బస్టాండ్‌కి చేరుకున్న కాజోల్, ఆమె ఫ్రెండ్‌ను వెతుక్కుంటూ వచ్చిన నన్స్, వారిని పట్టుకుని చెవులు మెలిపెట్టారని, తిరిగి స్కూల్‌కి తీసుకెళ్లారని ఆమె నవ్వుతూ గుర్తు చేసుకుంది.
“అప్పుడు నేను 11 ఏళ్ల వయస్సు. మా ఇంటి ముంబై నుంచి స్కూల్ ఉన్న పంచగని దూరం సుమారు ఐదు గంటల ప్రయాణం. అయినా కూడా అమ్మమ్మను చూడాలన్న తపనే అంత పెద్ద పని చేయించుకుంది,” అని కాజోల్ తృప్తిగా గుర్తు చేసుకుంది.


Recent Random Post: