500 మంది ఫైట‌ర్ల‌తో భారీ వార్! లొకేష‌న్ ఎక్క‌డ‌?

Share


కన్నడ నటుడు రిషబ్ శెట్టి, స్వీయదర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ కాంతార కు ప్రీక్వెల్ గా కాంతార-2 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా హోంబళే ఫిల్మ్స్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది. షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుండి, రిషబ్ ప్రతి సన్నివేశాన్ని అత్యంత జాగ్రత్తగా చేయడానికి కృషి చేస్తున్నాడు. డైరెక్షన్ చేస్తున్నప్పుడు నటించడం సులభమైన పని కాదు, అయితే రిషబ్ తన అనుభవంతో ఈ ఇద్దరు పాత్రలను సమర్ధంగా నిర్వహిస్తున్నారు.

కాంతార-2 కోసం రిషబ్ శెట్టి ఇప్పటికే శక్తివంతమైన శిక్షణ తీసుకున్నాడు. ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం, క‌ఠోరమైన శిక్షణ పొందిన రిషబ్, కలరియపట్టు, గుర్రపుస్వారి, కత్తి యుద్దంపై ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఈ శిక్షణను ప్ర‌ముఖ ట్రైన‌ర్ల ఆధ్వ‌ర్యంలో పూర్తిచేశాడు. ప్రస్తుతం, ఈ యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ కోసం సిద్ధమవుతున్నారు. ఇది ఓ భారీ వార్ సీక్వెన్స్ అని తెలుస్తోంది, ఇందులో 500 మంది ఫైటర్లు పాల్గొంటున్నారు.

వీరు అందరూ నైపుణ్యం గల ఫైటర్లు, యాక్షన్ కొరియోగ్రఫీలో అనుభవం కలిగినవారు. ఈ భారీ వార్ సన్నివేశాన్ని ఓ భారీ లోకేషన్ లో చిత్రీకరించనున్నారు, అయితే ఆ లోకేషన్ వివరాలు ఇంకా బైటికి రాలేదు. 500 మందితో వార్ సీక్వెన్స్ చిత్రీకరించడం బాహుబలి లో కాలకేయ-బాహుబలి మధ్య జరిగే భారీ యుద్ధ సన్నివేశం తరహాలో ఉండే అవకాశం ఉంది. చిత్ర బృందం ఈ సన్నివేశాన్ని ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు.

ప్రస్తుతం, ఈ వార్ సీక్వెన్స్ చిత్రీకరించడానికి కావలసిన అన్ని ఆయుధాలు మరియు భారీ ఎక్విప్‌మెంట్ సిద్ధం చేస్తున్నారు. ఈ సన్నివేశం పూర్తి చేస్తే, సినిమాలో సగభాగం షూటింగ్ పూర్తయినట్లే అంటున్నారు. కాంతార-2 సినిమా అక్టోబర్ 2న విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.


Recent Random Post: