తిరుపతిని పవన్‌కు బీజేపీ వదలాలని అనుకోవడం లేదు

త్వరలో జరుగబోతున్న తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికలో బీజేపీ మరియు జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడం ఖాయం అయ్యింది. ఇప్పటికే ఉప ఎన్నిక విషయంలో రెండు పార్టీల మద్య చర్చలు కూడా జరిగాయి. ఢిల్లీ వెళ్లిన పవన్‌ కళ్యాణ్‌ తో ఉప ఎన్నిక విషయంలో జేపీ నడ్డా కూడా చర్చించాడు అంటూ వార్తలు వచ్చాయి. తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు జనసేనాని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. జనసేన అభ్యర్థిని పోటీకి దించాలని పవన్‌ కళ్యాణ్‌ భావిస్తుంటే బీజేపీ మాత్రం తామే పోటీకి దిగాలని భావిస్తుంది.

గత ఎన్నికల్లో బీజేపీ కంటే జనసేనకే ఎక్కువ ఓట్ల శాతం దక్కింది. ఈ లెక్కన చూస్తే రెండు పార్టీల్లో జనసేనదే పై చేయి ఉండాలి. కాని తిరుపతి ఉప ఎన్నిక విషయానికి వస్తే బీజేపీ పట్టుదలతో వ్యవహరిస్తుంది. ఇటీవల పక్క రాష్ట్రం తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. అదే సెంటిమెంట్‌ ను ఏపీలో కొనసాగించే ఉద్దేశ్యంతో తిరుపతి సీటును బీజేపీ కోరుకుంటుంది. దాంతో పాటు వైకాపాను ఎదుర్కోగల సత్తా బీజేపీకి మాత్రమే ఉందని ఆ నాయకులు అంటున్నారు. టీడీపీ ఈ ఎన్నికల్లో గెలిస్తే 2024 అసెంబ్లీ ఎన్నికలకు బల పడుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీకి అవకాశం ఇవ్వకుండా తమ అభ్యర్థిని రంగంలోకి దించాలని బీజేపీ భావిస్తుంది. మరి పవన్‌ ఏమంటాడో చూడాలి.


Recent Random Post: