గతవారం రోజులుగా ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న జంట నిహారిక కొణిదెల – చైతన్య జొన్నలగడ్డ. డిసెంబర్ 11న వీరి వివాహం ఉదయ్ పూర్ లో అంగరంగవైభవంగా జరిగింది. కానీ దానికి వారం రోజుల ముందు నుంచే కొణిదెల ఫామిలీ ఇంట పెళ్లి సందడి మొదలైపోయింది. అలాగే ఉదయ్ పూర్ నుంచి రాగానే హైదరాబాద్ లో ఘనంగా రిసెప్షన్ చేశారు. రిసెప్షన్ అవ్వగానే నూతన దంపతులిద్దరూ కలిసి అన్నవరం వెళ్లారు. అక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించి, కొన్ని ప్రత్యేక పూజలు చేశారు. ఈ జంట ఇక్కడికే వెళితే అక్కడి ఫోట్లు వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
Posted inTelugu - Featured Telugu - Film News
