ఏపీ ప్రభుత్వం 56 బీసీ కార్పోరేషన్ లకు ఒకే సారి చైర్మన్లను నియమించి అందరి దృష్టిని ఆకర్షించింది. దేశంలో బీసీలకు ఎవ్వరు చేయని విధంగా ఏపీలో వైకాపా ప్రభుత్వం చేస్తున్నదంటూ వైకాపా నాయకులు అంటున్నారు. చైర్మన్ల నియామకం కార్యక్రమానికి పాండిచ్చేరి రాష్ట్ర మంత్రి మల్లాడి కృష్ణారావు హాజరు అయ్యారు. ఆ సంరద్బంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తన రాష్ట్ర రాజకీయాలను వదిలేసి జగన్ కుటుంబానికి సేవ చేస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.
ఒక రాష్ట్రంకు మంత్రిగా ఉండి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే జగన్ చాలా గొప్ప వాడు అంటూ వ్యాఖ్యలు చేయడం ఆయనకే చెల్లింది. జగన్ బీసీలకు చేస్తున్న సేవ, బీసీల కోసం ప్రవేశ పెడుతున్న పథకాలు అద్వితీయం అంటూ ప్రశంసలు కురిపించాడు. తనకు దేశంలోనే మూడవ సారి ఉత్తమ ఎమ్మెల్యేగా అవార్డు వచ్చింది. ఆ సందర్బంగా వచ్చే నెల 6న సన్మానం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి మా సీఎం కంటే ముందు మీ సీఎం జగన్ ను నేను ఆహ్వానిస్తున్నాను అంటూ జగన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. జగన్ ఆదేశిస్తే ఇప్పుడే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నట్లుగా ఆయన పేర్కొన్నాడు. ఆయన వ్యాఖ్యలు మరీ అతిగా ఉన్నాయనే విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
Recent Random Post: