నా పర్మినెంట్ ‘గుండు’కి కారణం ఆయనే: ఎంపీ అరవింద్

తెలంగాణ రాజకీయాల్లో వాక్ చాతుర్యం ఉన్న నాయకుల్లో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఒకరు. వాడి వేడి మాటలు, వాగ్భాణాలు, సందర్భానుసారం కౌంటర్లలలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు సరిసమానం అని చెప్పాలి. ఈరోజు తన ప్రెస్ మీట్ ఇవే మాటలతో నవ్వులు పూయించారు. అదీ తన గుండుపై సెటైర్లు వేసుకుని మరీ. కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేస్తాయని చెప్పుకొస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

చిన్నప్పటి నుంచి తిరుపతికి వెళ్లి గుండు కొట్టించుకోవడం అలవాటు. అలా చేయించుకుని.. చేయించుకుని ఇప్పుడు పూర్తిగా గుండైపోయిది.. అంటూ వ్యాఖ్యానించారు. దీంతో అక్కడంతా నవ్వులు విరిసాయి. మొత్తంగా తన గుండుకు కారణం తిరుపతి అని చెప్పారు.

గతంలో క్యూలైన్లలో లేట్ అయ్యేది.. ఇప్పుడు సుదర్శన కంకణాలు వచ్చాక గంటలో దర్శనం అవుతోంది. కొత్త వ్యవసాయ చట్టాలు కూడా రైతులుకు సుదర్శన కంకణాల వంటివే. తెచ్చిన పంట ఎంత, ఎక్కడి నుంచి, లెక్కలు.. సాయంత్రానికల్లా నగదు రైతుకు వస్తుంది అని లాజికల్ తిరుమల శ్రీవారి దర్శనాన్ని ఉదహరిస్తూ చెప్పుకొచ్చారు.


Recent Random Post: