నాగార్జున గారు అలా చేయడంపై అఖిల్‌ తల్లి దుర్గ ఆవేదన

టాలీవుడ్‌ కింగ్ నాగార్జున బిగ్‌ బాస్ సీజన్‌ 3 మరియు 4 లను చాలా చక్కగా హుందాగా నడిపించారు. ఆయన బిగ్‌ బాస్‌ ను ఎంతో చక్కగా హోస్టింగ్ చేశారంటూ ఎక్కువ శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. కొందరు మాత్రమే ఆయన విషయంలో కాస్త వ్యతిరేకంగా ఉన్నారు. ఫినాలే ఎపిసోడ్‌ ను కూడా చాలా చక్కగా నాగ్‌ ముగించాడు. అయితే ఫైనల్‌ విన్నర్‌ ను ప్రకటించే సమయంలో నాగార్జున వ్యవహరించిన తీరు కొందరికి ఆశ్చర్యంగా అనిపించింది. నాగ్‌ అది కావాలని చేసి ఉండక పోవచ్చు కాని అది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది.

విజేతల్లో ఒక్కరిగా అభిజిత్ మరియు అఖిల్‌ లను ప్రకటించాల్సి ఉండగా నాగార్జున ఇద్దరు చేతులను పట్టుకుని ఉన్నాడు. ఆ సమయంలో కౌంట్‌ డౌన్‌ ప్రారంభం అయ్యింది. సస్పెన్స్‌ కు తెర దించి అఖిల్‌ చేతిని ఒక్క సారిగా కిందకు దించి విసిరేసినట్లుగా వదిలేసి అభిజిత్‌ చేతిని పట్టుకున్నాడు. అఖిల్‌ ను కసిగా వెనక్కు విసిరేసినట్లుగా అనిపించింది. అలా చేయడం పై పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తుండగా అఖిల్ తల్లి దుర్గ కూడా స్పందించారు. నాగార్జున గారు సీజన్ మొత్తం చక్కగా హోస్టింగ్‌ చేశారు. అయితే చివర్లో అలా చేయడం నాకు కాస్త బాధగా అనిపించింది అంటూ పేర్కొంది. నా కొడుకును అలా విసిరేసినట్లుగా చేయడంతో తల్లిగా బాధ పడ్డట్లుగా దుర్గ అన్నారు.


Recent Random Post: