తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్ కంటే టాప్ 3 స్థానంలో నిలిచిన సోహెల్‌కు ఎక్కువ వచ్చింది ఇది ఎంత మాత్రం ఫెయిర్ గేమ్ కాదు అంటూ ప్రేక్షకులు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో అభిజిత్ కు దక్కింది ఎంత అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పారితోషికం రూపంలో అభిజిత్ కు దక్కింది అందరి కంటే ఎక్కువ అంటున్నారు. బిగ్ బాస్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అభిజిత్ కు వారంకు దాదాపుగా నాలుగు లక్షల పారితోషికంను ఇవ్వడం జరిగిందట.
15 వారాలు పూర్తిగా అభిజిత్ ఉన్నాడు కనుక పారితోషికం రూపంలో 60 లక్షల రూపాయలు వచ్చాయి. ఇక ప్రైజ్ మనీగా 25 లక్షల రూపాయలు ఇచ్చారు. కనుక మొత్తంగా 85 లక్షల రూపాయలు వచ్చాయి అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 4 వల్ల అభిజిత్ కు దాదాపుగా కోటి వరకు కలిసి వచ్చిందంటున్నారు. లక్షన్నర విలువ చేసే బైక్ అందుకు అదనంగా చెప్పుకోవచ్చు. అభిజిత్ ఎంత డబ్బు వచ్చినా కూడా నాకు ప్రేక్షకుల్లో ఇంత గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉందని.. వారి ప్రేమకు ఖచ్చితంగా రుణపడి ఉంటాను అంటూ వ్యాఖ్యలు చేస్తున్నాడు.
Recent Random Post: