రజినీకాంత్‌ పార్టీ పెట్టక పోవడంతో అభిమాని ఆత్మహత్య

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ అనారోగ్య కారణాలతో పార్టీ పెట్టలేక పోతున్నాను అంటూ ప్రకటించాడు. రజినీకాంత్‌ పార్టీ పెట్టడం లేదు అంటూ ప్రకటించిన నేపథ్యంలో చాలా మంది తీవ్ర మనో వేదనకు గురి అయ్యారు. దాదాపుగా 20 ఏళ్లుగా రజినీకాంత్‌ రాజకీయ పార్టీ గురించి మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాని ఆయన మాత్రం అదుగో ఇదుగో అంటూ ఈ ఏడాది జరుగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దం అన్నట్లుగా ప్రకటించాడు.

పార్టీని ప్రకటించకుండానే రజినీకాంత్‌ రాజకీయాలకు దూరం అవుతున్నట్లుగా పేర్కొన్నాడు. జె. రాజ్ కుమార్‌ అనే అభిమాని సోషల్‌ మీడియాలో రజినీకాంత్‌ నా జీవితం.. ఇదే నా జీవితంలో ఆకరి పోస్ట్‌ అంటూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఆ తర్వాత కొద్ది సమయంకు ఆయన మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆత్మహత్య అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాని పోలీసులు మాత్రం రాజ్‌ కుమార్‌ కు మూర్చ జబ్బు ఉంది. ఆ జబ్బుతోనే ఆయన మృతి చెందినట్లుగా పేర్కొన్నారు. కేసు నమోదు చేయలేదని, కుటుంబ సభ్యులు ఫిర్యాదు ఇవ్వలేదని పోలీసులు తెలియజేశారు.


Recent Random Post: