తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు కార్తీక దీపం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆ సీరియల్ ప్రతి ఇంట్లో వారికి చేరువ అయ్యింది. ఆ సీరియల్ లో అత్త పాత్ర సౌందర్యగా అర్చన అనంత్ నటిస్తున్న విషయం తెల్సిందే. సీరియల్ ఆరంభంలో సౌందర్య విలన్ గా కనిపించింది. ఆ సమయంలో ఆమె నటనకు అంతా ఫిదా అయ్యారు. కుటుంబం పరువు అంటూ ప్రాకులాడే ఒక పెద్దింటి మహిళ పాత్రలో అర్చన బాగా నటించారు. ఇప్పుడు కొడుకు జీవితం కోడలు మనవరాళ్ల జీవితాల గురించి తాపత్రయ పడే ఆంటీ పాత్రలో నటిస్తుంది.
అయిదు పదుల వయసు ఉన్న హుందా అయిన మహిళ పాత్రలో అర్చన నటిస్తుంది. కాని ఆమె వయసు ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. అర్చన వయసు ప్రస్తుతం 33 ఏళ్లు. అంటే సీరియల్ లో కొడుకు గా నటిస్తున్న డాక్టర్ బాబు కంటే కూడా చిన్నదే. తనకు కోడలుగా నటిస్తున్న దీప కు సమానమైన వయసు. అలాంటి అర్చన అంత పెద్ద వయసు పాత్రలో నటించడం సరిగ్గా సూట్ అవ్వడం నిజంగా ఆశ్చర్యం. అర్చన అలాంటి పాత్రలకే సూట్ అవుతుందనే ఉద్దేశ్యంతో వరుసగా ఆమెకు అవే పాత్రలు ఇస్తున్నారు. చిన్న వయసులోనే అంత పెద్ద పాత్రలు పోషించడం నిజంగా ఆశ్చర్యమే కదా..!
Recent Random Post: