పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ కు సంబంధించిన విషయాలు ఫొటోలు వీడియోలు గత కొన్ని రోజులుగా లీక్ అవుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఈ సినిమాకు సంబంధించిన ఫొటోలు మరియు వీడియోలు మళ్లీ లీక్ అయ్యాయి. వకీల్ సాబ్ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ ఫైట్ లో పాల్గొన్న ఒక నటుడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఫొటోలు మరియు ఒక చిన్న వీడియో కూడా షేర్ చేసిన అతడు వెంటనే దాన్ని తొలగించాడు. అప్పటికే అది వైరల్ అవ్వడంతో చర్చనీయాంశం అయ్యింది.
వకీల్ సాబ్ సినిమా షూటింగ్ కు ఇటీవలే గుమ్మడి కాయ కొట్టారు. త్వరలోనే సినిమా విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సినిమా కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నాయి. వకీల్ సాబ్ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ నటిస్తున్న విషయం తెల్సిందే. పింక్ రీమేక్ అయిన ఈ సినిమా ను దిల్ రాజు నిర్మిస్తుండగా వేణు శ్రీరామ్ తెరకెక్కించాడు. సమ్మర్ లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. లీక్ లతో దిల్ రాజుకు పెద్ద తలనొప్పిగా మారింది.
Recent Random Post: