‘సోనూసూద్..’ ఈపేరు ఇప్పుడు దేశంలో ఓ సంచలనం. లాక్ డౌన్ లోనే కాకుండా ఇప్పుడూ ఆయన చేస్తున్న సాయం ప్రజల గుండెల్లో హీరోని చేసింది. ఇంతటి పేరు సంపాదించిన సోనుసూద్ పై బీఎంసీ (బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్) చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. సోనుసూద్ కు సంబంధించిన కేసులో హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో ‘అలవాటు పడ్డ పాత నేరస్థుడు’ అని పేర్కొంది.
ముంబైలోని జుహూ ప్రాంతంలో ‘శక్తి సాగర్’ పేరుతో ఆరు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నాడు సోను సూద్. హోటల్‌గా మారుస్తున్నాడంటూ కూడా బీఎంసీ తన అఫిడవిట్లో పేర్కొంది. గతంలో రెండుసార్లు కూల్చేసినా ఈ నిర్మాణం ఆపడం లేదని ఆరోపిస్తున్నారు. గత అక్టోబర్ లో నోటీసులు ఇవ్వగా దిగువ కోర్టు కొట్టేసింది. దీంతో సునుసూద్ హైకోర్టు వెళ్లగా విచారణ చేపట్టిన హైకోర్టు అఫిడవిట్ దాఖలు చేయాలని బీఎంసీని ఆదేశించింది. గతోం కూల్చేసిన బిల్డింగ్ ప్రాంతంలో మళ్లీ అనుమతులు లేకుండా భవనం నిర్మించే ప్లాన్ చేస్దున్నాడని ఆరోపించింది.
Recent Random Post: