తమిళ జల్లికట్టు వేడుకలో రాహుల్‌ గాంధీ

తమిళనాడు లో సంక్రాంతి సందర్బంగా జల్లికట్టు వేడుకలు వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి రాష్ట్ర వ్యాప్తంగా జల్లికట్టు ను నిర్వహించడంతో పాటు ప్రముఖులు పాల్గొంటూ ఉంటారు. కోర్టులు ఈ ఆటను బ్యాన్‌ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసినా కూడా తమిళనాడు ప్రభుత్వం ఆటను కొనసాగిస్తూనే ఉంది. ఈ ఏడాది జల్లికట్టు ఆటల కార్యక్రమాన్ని చూసేందుకు తమిళనాడుకు కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ వెళ్లారు. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ తో కలిసి ఆయన జల్లికట్టును చూశారు.

మదురైలోని అవనియపురంలో ఈ కార్యక్రమం జరిగింది. అక్కడ రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. జల్లి కట్టు నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని ఆంక్షలను విధించింది. 50 శాతం జనాలతో మాత్రమే జల్లి కట్టు నిర్వహించారు. రాహుల్‌ గాంధీ వచ్చిన విషయం తెలియడంతో భారీ ఎత్తున జనాలు వచ్చారు. రైతుల జీవితంలో భాగం అయిన జల్లి కట్టు కార్యక్రమం చూసేందుకు రావడం సంతోషం అంటూ రాహుల్‌ గాంధీ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాహుల్‌ గాంధీ జల్లికట్టు కార్యక్రమంలో పాల్గొనడంను బీజేపీ నాయకులు తప్పుబడుతున్నారు.


Recent Random Post: