గోపూజ మహోత్సవంలో సీఎం జగన్‌

ఏపీలో దేవాలయాల్లో జరుగుతున్న దాడులు మరియు విగ్రహ ద్వంసంకు సంబంధించిన వివాదం నడుస్తున్న నేపథ్యంలో దోషాలను సవరించడంతో పాటు అనేక విధాలుగా హిందువులను ప్రసన్నం చేసుకునేందుకు జగన్‌ ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇటీవలే దాదాపుగా 50 దేవాలయాలను నిర్మించేందుకు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గో పూజ మహోత్సవంను ప్రభుత్వం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌ మోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

గుంటూరు జిల్లా నరసరావు పేట లో జరిగిన గోపూజ కార్యక్రమం లో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు. వేద పండితుల సమక్షంలో గో పూజ నిర్వహించారు. జగన్ తో పాటు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కనుమ పండుగ సందర్బంగా సాంప్రదాయ బద్దంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లుగా ప్రభుత్వ వర్గాల వారు అంటున్నారు. ప్రభుత్వం హిందువులకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని హిందువుల మనో భావాలు దెబ్బ తీసే విధంగా తాము ఏమీ ప్రవర్తించడం లేదని క్లారిటీ ఇచ్చారు.


Recent Random Post: