సోనూసూద్‌ సరికొత్త సర్వీస్.. నువ్వు మళ్లీ దేవుడివి సామీ

సోనూసూద్ ఈమద్య కాలంలో వరుసగా చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆయన్ను రియల్‌ హీరోగా మార్చేశాయి. కోట్ల రూపాయల సాయం చేస్తూ ఎంతో మందికి అండగా నిలుస్తున్నాడు. లాక్ డౌన్ సమయంలో ఆయన చేసిన కార్యక్రమంకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఇప్పుడు మరోసారి ఆయన తన మంచితనంను చాటుకున్నాడు. హైదరాబాద్ లో తన పేరుతో సోనూసూద్ ఆంబులెన్స్ సర్వీస్ ను ప్రారంభించాడు. ఆపదలో ఉన్న వారి కోసం ఈ ఆంబులెన్స్ లు ఉచిత సర్వీస్‌ లను అందించబోతున్నాయి.

కొన్ని వ్యాన్‌ లను కొనుగోలు చేసిన సోనూసూద్‌ వాటిని ఆంబులెన్స్ లుగా మాడిఫై చేయించి హైదరాబాద్‌ లో సర్వీస్ కు ఉంచుతున్నట్లుగా పేర్కొన్నాడు. ఈ ఆంబులెన్స్ లను స్వయంగా తానే ప్రారంభించాడు. ఆంబులెన్స్ సర్వీస్ లతో చాలా మందికి సాయంగా నిలుస్తామని సోనూసూద్‌ అన్నారు. కొందరు ఆంబులెన్స్‌ సర్వీస్ అందుబాటులో లేకపోవడంతో మృతి చెందుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. అందుకే ఈ పని చేస్తున్నట్లుగా సోనూసూద్‌ చెబుతున్నాడు.


Recent Random Post: