రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన క్రాక్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమా విడుదలకు ముందే ఆహా వారు డిజిటల్ ప్రీమియర్ రైట్స్ ను దక్కించుకున్నాడు. ఈ సినిమాను రూ.8.25 కోట్ల కు ఆహా దక్కించుకుంది. సినిమాను జనవరి 29న స్ట్రీమింగ్ చేసేందుకు ముందే ఒప్పందం చేసుకుంది. సాదారణంగా థియేట్రికల్ రిలీజ్ తర్వాత కనీసం 50 రోజుల తర్వాతే సినిమాను డిజిటల్ లో స్ట్రీమింగ్ చేయాల్సి ఉంటుంది. కాని క్రాక్ సినిమా ను మాత్రం మూడు వారాలకే విడుదల చేయాలని అల్లు అరవింద్ నిర్మాతతో ఒప్పందం చేసుకున్నాడు.
ఆహా లో ఈనెల 29న స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. ఇంకా కూడా థియేటర్లలో క్రాక్ సినిమా మంచి వసూళ్లు నమోదు చేస్తున్న నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు సినిమాను ఆహాలో స్ట్రీమింగ్ చేయడం ఆపేయాలంటూ డిమాండ్ చేశారు. దాంతో నిర్మాత రంగంలోకి దిగి అల్లు అరవింద్ తో చర్చలు జరిపాడు. వారం రోజుల తర్వాత సినిమాను ఆహాలో స్ట్రీమింగ్ చేయాలని విజ్ఞప్తి చేశాడు. అందుకు కొంత నష్టపరిహారం కూడా చెల్లించేందుకు సిద్దం అయ్యాడు. అంటే సినిమా రూ.8.25 కోట్లు కాకుండా దాదాపుగా కోటిన్నర తక్కువకు ఇచ్చే అవకాశం ఉంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను ఫిబ్రవరి 5న ఆహాలో స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉంది.
Recent Random Post: