విరాట్‌ కోహ్లీ, తమన్నాలకు కోర్టు నోటీసులు

టీం ఇండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ మరియు స్టార్‌ హీరోయిన్‌ తమన్నాలతో పాటు మరి కొందరు స్టార్స్ కు కేరళ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీరు గత కొంత కాలంగా ఆన్ లైన్ గేమింగ్ మరియు గ్యాంబ్లింగ్ లకు అనుకూలంగా ప్రమోసన్ చేస్తున్నారు. వాటి వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ఆ విషయమై అవస్థలు ఎదుర్కొంటున్నాయి. ఆ కారణంగానే ఆ గేమ్స్ ను నిలిపి వేయాలని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయించారు. అదే విషయమై ఇప్పుడు కోహ్లీ మరియు తమన్నాలకు కోర్టులు నోటీసులు పంపించాయి.

చట్ట విరుద్దమైన గేమ్స్‌ కు మీరు ఎలా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తారు అంటూ కోర్టు ప్రశ్నించింది. ఈ విషయమై మీ సమాధానం ఏంటీ అంటూ తమన్నా మరియు కోహ్లీలకు నోటీసులు ఇవ్వడం జరిగింది. కొన్నాళ్ల క్రితమే కోహ్లీ మరియు తమన్నాలు ఆన్‌ లైన్‌ గేమింగ్‌ సంస్థల ప్రమోషన్‌ కు నో చెప్పారు. కేరళ ప్రభుత్వం కూడా ఇప్పటికే ఆన్‌ లైన్‌ గేమింగ్‌ లకు కేరళ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు అంటూ కోర్టు కు తెలియజేయడం జరిగింది. ఈ నోటీసులపై తమన్నా మరియు కోహ్లీలు ఎలాంటి సమాధానం ఇస్తారనేది చూడాలి.


Recent Random Post: