వైకాపా మంత్రి కొడాలి నాని మరోసారి మాజీ మంత్రి నారా లోకేష్ పై కామెంట్ చేశాడు. మూడు శాఖలకు మంత్రిగా చేసిన లోకేష్ మొన్నటి ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిపోయాడు. ఆయన ప్రజా క్షేత్రంలో గెలువలేక కిందా మీదా పడ్డాడు అంటూ కొడాలి నాని విమర్శలు గుప్పించాడు. లోకేష్ కనీసం పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచ్ గా కూడా గెలువలేడు అంటూ ఈ సందర్బంగా కొడాలి నాని అన్నాడు. ఏదైనా గ్రామ పంచాయితీలో లోకేష్ పోటీ చేసి గెలిస్తే తాను రాష్ట్రం వదిలి వెళ్లి పోతాను అంటూ సవాల్ విసిరాడు.
రాష్ట్రంలో ప్రతి చోట కూడా వైకాపా గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ప్రభంజనం నమోదు అవుతుంది. మాజీ మంత్రి దేవినేని ఉమ నియోజక వర్గంలో వైకాపా 44 పంచాయితీల్లో గెలిస్తే కేవలం టీడీపీ 3 చోట్ల మాత్రమే గెలుపొందింది. తెలుగు దేశం ముఖ్య నాయకులు కూడా తమ నియోజక వర్గంలో పంచాయితీ ఎన్నికల్లో ప్రభావం చూపడంలో విఫలం అయ్యారు. వారు వైకాపాపై విమర్శలు చేయడం ఏంటీ అంటూ కొడాలి నాని అన్నాడు. ఆ సందర్బంగానే లోకేష్ పై నాని విమర్శలు చేశాడు.
Recent Random Post: