నిజానికి రాజకీయ పార్టీల ప్రత్యక్ష ప్రమేయం లేకుండా పంచాయితీ ఎన్నికలు జరగాల్సి వున్నా, రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు జరిగింది రాజకీయ పార్టీల ప్రమేయంతోనే. అన్ని రాజకీయ పార్టీలూ స్థానిక ఎన్నికల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్షం.. పోటాపోటీగా తమ సత్తా చాటేందుకు ప్రయత్నించాయి. ఓటర్లను బెదిరించేందుకు, ఓటర్లను ప్రలోభపెట్టేందుకూ ప్రయత్నాలు జరిగాయి. అభ్యర్థుల విషయంలో నడిచిన రాజకీయాలు అన్నీ ఇన్నీ కావు. ‘మేమే గెలిచాం’ అని వైసీపీ ప్రకటించుకుంది.. కాదు, మేమే సత్తా చాటాం.. అని టీడీపీ ప్రకటించేసుకుంది.
మొదట ఇటు యెల్లో మీడియా, అటు బ్లూ మీడియా.. జనసేన గెలుపుని పట్టించుకోలేదు. కానీ, గ్రామ స్థాయిలో జనసేన జెండాలు రెపరెపలాడాయి. ఎక్కడికక్కడ గెలిచిన అభ్యర్థులు ర్యాలీలు తీశారు. నినాదాలతో హోరెత్తించారు. అనూహ్యంగా మహిళా లోకం దుమ్మురేపింది.. ఎర్ర కండువా గిరగిరా తిరిగింది. దెబ్బకి దెయ్యం వదిలేసినట్లు.. తెలుగు మీడియాకి పట్టిన ‘యెల్లో, బ్లూ’ జాడ్యాలూ వదిలేశాయి. తప్పలేదు… జనసేన పార్టీ సత్తా చాటిందని తెలుగు మీడియా ఒప్పుకోక తప్పలేదు. తొలి విడత పంచాయితీ ఎన్నికల్లో జనసేన ఓటు బ్యాంకు 18 శాతంగా వుందనీ, అది రెండో విడత పంచాయితీ ఎన్నికలకొచ్చేసరికి 22 శాతానికి చేరుకుందనీ లెక్కలు కడుతున్నాయి పలు మీడియా సంస్థలు. మీడియా అండతో జనసేనను తొక్కి పడేశాం.. అనుకుంటోన్న వైసీపీ, టీడీపీలకు ఈ లెక్కలు మింగుడు పడే అవకాశమే లేదు.
‘మేమే గెలిచాం.. కావాలంటే లెక్కలు చూసుకోండి..’ అని ఇప్పటిదాకా హడావిడి చేసిన వైసీపీ, టీడీపీ నేతలు ఒక్కసారిగా సైలెంటయిపోయారు. ఎలా.? జనసేన పార్టీ మద్దతుదారులు ఎలా గెలిచారు.? అంటూ పచ్చ పార్టీ, బులుగు పార్టీ ఒకరి జుట్టు ఇంకొకరు పీక్కోవాల్సి వస్తోంది. ఎంతైనా 60-40 బంధం కదా.. వారి బాధ అలాగే వుంటుంది. ‘గెలిస్తే నువ్వు గెలవాలి.. లేదంటే నేను గెలవాలి..’ అని రాష్ట్రాన్ని టీడీపీ – వైసీపీ పంచేసుకున్నట్లే రాజకీయం నడిచింది ఇప్పటిదాకా. ఇకపై ఆ పరిస్తితి వుండకపోవచ్చు. జనసేన అంచనాలకు మించి సత్తా చాటుతోంది. అది ఒప్పుకోవడానికి తెలుగు మీడియాకి ఇంత సమయం పట్టిందన్నమాట.. ఇక, టీడీపీతోపాటు వైసీపీ కూడా ఆ వాస్తవాన్ని ఒప్పుకోక తప్పదు.
Recent Random Post: