పటాస్ ఫహీమా కష్టాలు వర్ణణాతీతం

పటాస్ కామెడీ షో తో లేడీ కమెడియన్‌ గా పరిచయం అయిన ఫహీమా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. తాను సంపాదించే డబ్బు తన కుటుంబ అవసరాలను కూడా తీర్చలేక పోతున్నట్లుగా చెప్పింది. రూ.3 వేల రూపాలు అద్దె చెల్లించి చిన్న రూంలో ఉంటున్నామని, ఆ అద్దె కూడా చెల్లించలేక కొన్ని సార్లు రూమ్‌ ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పింది. ఫహీమా తల్లి గతంలో బీడీలు చుట్టేదట. కాని ఇప్పుడు అనారోగ్య పరిస్థితుల కారణంగా మానేసిందట. ఇక ఫహీమా తండ్రి చేసిన అప్పులు తీర్చేందుకు దూర ప్రాంతాలకు వెళ్లి పనులు చేస్తూ ఉన్నాడు.

తనకు వస్తున్న డబ్బుతో కుటుంబ అవసరాలు తీరడం లేవని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన అవసరాలు అన్ని తీరాలంటే బిగ్ బాస్ షో కు వెళ్లాలని అనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. పెద్ద ఎత్తున ఉన్న ఆర్థిక ఇబ్బందులను తప్పించుకునేందుకు ఏదైనా కామెడీ షో లో ఫుల్‌ టైమ్‌ కమెడియన్‌ గా జాయిన్‌ అవ్వాలని కోరుకుంటున్నాను. కాని ఎవరు కూడా ఫుల్‌ టైమ్‌ ఆఫర్లు ఇవ్వడం లేదు. స్కిట్‌ కు వెయ్యి రెండు వేలు ఇచ్చి చేయించుకుంటున్నారు తప్ప పూర్తి స్థాయి ఆఫర్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.


Recent Random Post: