సిగ్గు సిగ్గు.. పవన్ కళ్యాణ్ పరపతి గురించి మంత్రిగారు ప్రశ్నించడమా.?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా లేఖ రాసి ఊరుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. విశాఖకు సంబంధించి ‘ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్’ కంటే ముఖ్యమైన అంశాలు చాలా వున్నాయి. అందులో రైల్వే జోన్ ఒకటి.. విశాఖ ఉక్కు పరిశ్రమ ఇంకోటి. ఇవే కాదు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ.. కోటాలో, విశాఖ జిల్లా కూడా వుంది. కానీ, ఇవేవీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పట్టడంలేదు. విశాఖ రైల్వే జోన్ కోసం కేంద్రం మీద ముఖ్యమంత్రి ఒత్తడి తెచ్చారా.?

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ దిశగా కేంద్రం అడుగులేస్తోంటే, ‘వద్దు’ అని ఢిల్లీకి వెళ్ళి కేంద్రానికి ముఖ్యమంత్రి చెప్పగలిగారా.? కానీ, ‘పరపతి’ గురించి ఓ మంత్రిగారు మాట్లాడేస్తున్నారు.. అసెంబ్లీలో ఒక్క సీటు లేని (ఒకటి వున్నా లేనట్టే లెక్క), పార్లమెంటులో ఒక్క ఎంపీ కూడా లేని జనసేన పార్టీని, రాష్ట్రంలో ల్యాండ్ స్లైడ్ విక్టరీ కొట్టిన పార్టీ ప్రశ్నించడమట.. అదీ, ‘మీ పరపతి వుంటే, ఢిల్లీలో చూపించండి’ అని. పవన్ కళ్యాణ్‌కి ఢిల్లీలో పరపతి వుంది కాబట్టే, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినదిస్తూ, ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో చర్చించారు.. ప్రైవేటీకరణ ఆలోచనని వెనక్కి తీసుకోవాలని కోరారు. మిత్రపక్షంగా జనసేన ఇంతకంటే ఏం చేయగలదు.? ‘మీకు చేతనైతే, మీకు ఢిల్లీలో పరపతి వుంటే, చేసి చూపించండి..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఓ మంత్రిగారు సవాళ్ళ పర్వానికి దిగుతారు నిస్సిగ్గుగా.

రాష్ట్రంలో అధికారంలో వున్నదెవరు.? పార్లమెంటులో అత్యధిక సంఖ్యలో రాష్ట్రం నుంచి ఎంపీలు వున్నదెవరికి.? అధికారంలో వున్నోళ్ళు, ‘మాకు చేకాదు.. చేవ చచ్చిన పార్టీ మాది..’ అని, గద్దె దిగిపోయి, ఆ తర్వాత ఇతరుల పరపతి గురించి మాట్లాడితే బావుంటుందేమో. ఏం, ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసినట్లుగా, మొత్తంగా వైసీపీ ఎంపీలంతా.. ఢిల్లీలో ఆందోళనలు చేసి, రాజీనామా చేస్తామంటూ కేంద్రాన్ని హెచ్చరించలేకపోతున్నారెందుకు.? ఏ భయం వారిని అలా చేయకుండా అడ్డుకుంటోంది.? జనసేనాని ప్రశ్నించిన మంత్రిగారు బదులు చెప్పగలరా.!


Recent Random Post: