అమలకు తెగ నచ్చి ముద్దులు పంపించిందిః నాగార్జున

నాగార్జున కాస్త గ్యాప్ తీసుకుని వస్తున్న వైల్డ్‌ డాగ్ సినిమా వచ్చే నెల 2వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. విడుదలకు ఇంకా రెండు వారాలు ఉండగానే విడుదల హడావుడి మొదలైంది. ఇటీవలే చిరంజీవి చేతుల మీదుగా ఈ సినిమ ట్రైలర్‌ ను విడుదల చేయించారు. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. పది మిలియన్‌ ల వ్యూస్‌ కు ఈ ట్రైలర్ దగ్గరగా ఉంది. యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్న ఈ ట్రైలర్ పై పలువురు పలు రకాలుగా స్పందించినట్లుగా నాగ్ చెప్పుకొచ్చాడు.

వైల్డ్‌ డాగ్ ట్రైలర్‌ విడుదల అయిన వెంటనే చూసిన అమల మెసేజ్ చేసింది. అందులో పది ముద్దులు, పది స్టార్స్‌ ఈమోజీలు ఉన్నాయి. తనకు అంతగా ట్రైలర్ నచ్చిందని నాగార్జున అన్నాడు. ఆమె మెసేజ్ తో సినిమాపై నాకు మరింత నమ్మకం కలిగిందని చెప్పుకొచ్చాడు. చిరంజీవి మరియు మహేష్‌ బాబు కూడా సినిమా ట్రైలర్‌ పై ప్రశంసలు కురిపించిన విషయం తెల్సిందే. వారిద్దరికి నాగార్జున కృతజ్ఞతలు తెలియజేశాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్‌ చేయాలంటూ నాగార్జున ప్రమోషన్‌ సందర్బంగా అభిమానులకు ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశాడు.


Recent Random Post: