కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకుంది. స్వయంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని పార్లమెంట్ లో ప్రకటించడంతో ఆందోళనలు మరింత ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికే కేంద్రంకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రైవేటీకరణ నిలిపి వేయాలని లాభాల్లోకి తీసుకు వెళ్లేందుకు మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇక విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన పార్టీ కూడా తమదైన శైలిలో ఆందోళనలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది.
ఇటీవల జనసేనాని పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ ఆందోళన కారులకు తన మద్దతు ప్రకటించారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నాడు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి కేంద్రంకు పంపించాలని సూచన చేశాడు. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానంకు కేంద్ర ప్రభుత్వం నుండి పాజిటివ్ గా స్పందన వచ్చే అవకాశాలు ఉన్నాయని పవన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. మరి సీఎం జగన్ పవన్ ప్రతిపాధనను ఎలా స్పీకరిస్తాడు అనేది చూడాలి.
Recent Random Post: