టాలీవుడ్లో బాహుబలి విడుదల తర్వాత నాన్ బాహుబలి రికార్డులు గురించే మాట్లాడుకుంటున్నాం. అలాంటిది బాహుబలి రికార్డునే బీట్ చేస్తే…అది కూడా ఒక చిన్న సినిమా అంటే నమ్ముతారా? కానీ ఇది నిజం అండీ బాబు. ఇటీవల విడుదలైన జాతిరత్నాలు సినిమా సూపర్ హిట్ టాక్‌తో భారీ కలెక్షన్ల వైపు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో థియేటర్లకు అడ్డాగా పేరున్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో తొలి వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ‘జాతిరత్నాలు’ మూడో స్థానానికి చేరుకోవడం విశేషం. ఈ క్రమంలో అది ‘బాహుబలి: ది కంక్లూజన్’ వసూళ్లను కూడా అధిగమించింది.
2017 ఏప్రిల్‌లో విడుదలైన ‘బాహుబలి: ది కంక్లూజన్’ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్లో తొలి వారం రూ.36 లక్షల గ్రాస్ వరకు కలెక్ట్ చేసి అప్పటి వరకు ఉన్నపాత రికార్డులను చెరిపేసి తన పేరుని నమోదు చేసుకుంది. ఈ రికార్డును గత ఏడాది సంక్రాంతి సినిమాలు ‘అల వైకుంఠపురములో’, ‘సరిలేరు నీకెవ్వరు’ అధిగమించాయి. అల వైకుంఠపురములో రూ.40.83 లక్షల గ్రాస్‌లో అగ్ర స్థానంలో కొనసాగుతుండగా, ‘సరిలేరు నీకెవ్వరు’ దానికి చేరువగా వచ్చి తృటిలో మొదటి స్థానాన్ని చేజార్చుకొని రెండో స్థానంలో ఉంది. ఆ చిత్రం రూ.40.76 లక్షలు కొల్లగొట్టింది. ప్రస్తుతం దేవి థియేటర్లో ఆడుతున్న ‘జాతిరత్నాలు’ తొలి వారం రోజుల్లో రూ.38.63 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసి బాహుబలిని నాలుగో స్ధానాని వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరుకుంది. కానీ ‘జాతిరత్నాలు’ లాంటి చిన్న సినిమా పెద్ద సినిమాలతో ధీటుగా వసూళ్లు రాబట్టి టాప్-5లో నిలవడం అంటే మామూలు విషయం కాదని సీని పండితులు అంటున్నారు.
Recent Random Post: