ఆచార్య ఫస్ట్ సింగిల్ నుండి కీలక అప్డేట్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న నెక్స్ట్ సినిమా ఆచార్య. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. మే 13న ఆచార్య సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈరోజు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆచార్య నుండి చరణ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు.

ఇదిలా ఉంటే ఆచార్య నుండి కీలకమైన మరో అప్డేట్ వచ్చింది. ఈ చిత్ర ఫస్ట్ సింగిల్ లహే లహే సాంగ్ ను మార్చ్ 31న సాయంత్రం 4 గంటల 5 నిముషాలకు విడుదల చేయనున్నారు.

మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ కు హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తోంది.


Recent Random Post: