తిరుపతి ఉప ఎన్నికల్లో వైకాపాను ఢీ కొట్టేందుకు బీజేపీ మరియు జనసేనపార్టీ లు కలిసి పోటీ చేయాలనుకున్నాయి. మద్యలో బీజేపీ తీరు కారణంగా రెండు పార్టీల మద్య విభేదాలు వచ్చాయి. ముందుగా అనుకున్న ప్రకారం సీటును వారికే పవన్ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ బీజేపీకి అధికారికంగా మద్దతు ఇస్తాడా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికంగా మారింది. క్షేత్ర స్థాయిలో బీజేపీ కి జనసేన నాయకులు మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఈ సమయంలోనే ఏప్రిల్3వ తారీకున జనసేనాని పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటన పెట్టుకున్న నేపథ్యంలో బీజేపీ నాయకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తిరుపతిలో రోడ్డు షో తో పాటు బహిరంగ సభను కూడా పవన్ నిర్వహించబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీకి మద్దతుగా మాట్లాడి.. బీజేపీ ఎంపీ క్యాండిడేట్ రత్నప్రభకు మద్దతు తెలుపుతాడా అనేది చూడాలి. తిరుపతిలో పవన్ ప్రచారం వల్ల ఖచ్చితంగా బీజేపీకి కొండంత బలం అంటున్నారు. అందుకే పవన్ ను ప్రసన్నం చేసుకునేందుకు తిరుపతి నాయకులు మరియు రాష్ట్ర నాయకత్వం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మూడవ తారీకు జరుగబోతున్న కార్యక్రమాల్లో బీజేపీ ప్రస్థావన ఉంటుందా అసలు పవన్ బీజేపీ క్యాండిడెట్ తో ప్రచారం చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.
Recent Random Post: