తిరుపతి పార్లమెంట్ సీటు ఉప ఎన్నిక ప్రచార హోరు కొనసాగుతోంది. అధికార వైసీపీ మరియు తెలుగు దేశం పార్టీల మద్య పోరు రసవత్తరంగా సాగుతోంది. రెండు పార్టీలు కూడా నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారం చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ తరపున పనబాక లక్ష్మి పోటీ చేశారు. మాజీ మంత్రి అయిన పనబాక లక్ష్మి తరపున తెలుగు దేశం పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ నారా లోకేశ్ ప్రచారం చేశాడు. లోకేష్ తాజాగా సత్యవేడులో రోడ్డు షో నిర్వహిచాడు. ఆ సందర్బంగా వైకాపాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు.
లోకేష్ మాట్లాడుతూ.. 21 మంది లోక్ సభ ఆరుగురు రాజ్య సభ ఎంపీలు ఉండి వైకాపా ఏం సాధించింది. తెలుగు దేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు కూడా పార్లమెంటులో సింహాల మాదిరిగా పోరాడుతున్నారు. ఏపీకి సంబంధించిన పలు సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లి సమస్యల పరిష్కారం కోసం సింహాల మాదిరిగా పోరాటం చేస్తున్నారు. వైకాపా అభ్యర్థి గెలిస్తే కేంద్రం నిర్ణయాలకు తలాడించే గొర్రెల మందలో మరో గొర్రె చేరినట్లు అవుతుంది. అలా కాదని టీడీపీ ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తే మరో సింహం మాదిరిగా పోరాటం చేస్తారని లోకేష్ చెప్పుకొచ్చారు. కేంద్ర మంత్రిగా పని చేసిన పనబాక లక్ష్మి గారికి ఉన్న అనుభవం తో తిరుపతికి మంచి జరుగుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
Recent Random Post: