మహారాష్ట్ర హోం శాఖమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించిన వెంటనే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్పందించింది. చేసిన తప్పులకు శిక్ష తప్పదు అంటూ ఇండైరెక్ట్ గా రాజకీయాలను ప్రస్థావించింది. సాధువులను హత్య చేసి.. మహిళల పట్ల చులకన భావం ఉన్న ఏ ఒక్కరు కూడా చట్టం నుండి తప్పించుకోలేరు. ప్రతి ఒక్కరికి పతనం తప్పదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ అనిల్ దేశ్ ముఖ్ ను ఉద్దేశించి ఆమె ట్వీట్ చేసింది.
గతంలో ముంబయిలోని తన ఇంటిని ఆఫీస్ ను కూల్చి వేయడంతో పాటు తనను ముంబయికి రాకుండా అనిల్ దేశ్ ముఖ్ చేశాడనే ఉద్దేశ్యంతో కంగనా పై వ్యాఖ్యలు చేసింది. అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా చేసిన తర్వాత కూడా ఇది ఆరంభం మాత్రమే అంటూ హెచ్చరించడం చూస్తుంటే ఇంకా ఏం జరుగబోతుందా అంటూ అందరిలో ఆసక్తి వ్యక్తం అవుతోంది. బీజేపీ తరపున మాట్లాడుతూ కంగనా రనౌత్ చాలా బలంగా శివసేన పార్టీని ఢీ కొడుతోంది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.
Recent Random Post: