రీసెంట్ గా ఐకాన్ స్టార్ గా మారిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏప్రిల్ 8న తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నాడు. బన్నీ ఫ్యాన్స్ ఎందరో ఆయన ఇంటి ముందు హడావిడి చేశారు. బన్నీ కూడా వారితో సంతోషాన్ని పంచుకున్నాడు. అయితే.. బన్నీ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ చూపిన అత్యుత్సాహానికి జూబ్లీ హిల్స్ పోలిస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీంతో వారిపై చర్యలు తీసుకున్నారు పోలీసులు.
బన్నీ పుట్టినరోజు సందర్భంగా ముందురోజు రాత్రి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ప్రశాంత్, మరో అభిమాని సంతోష్ తో కలిసి పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. అయితే.. ఇవి కోవిడ్ నిబంధనలకు విరుద్ధమంటూ పోలిసులు కేసు నమోదు చేశారు. ఇందుకు ఎటువంటి పర్మిషన్ లేదనీ.. స్థానికులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని పోలీసులు అంటున్నారు. దీంతో పెట్రో కార్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై ఐపీసీ 290 కింద పబ్లిక్ న్యూసెన్స్, ఐసీపీ 336, ఐపీసీ 188 కింద కేసు నమోదు చేశారు.
Recent Random Post: