కార్తీ సుల్తాన్ ఓటిటి విడుదల తేదీ ఖరారు

తమిళ హీరో కార్తీకి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. కార్తీ సినిమాలు ఇక్కడ కూడా మంచి బిజినెస్ చేస్తాయి. 2019లో విడుదలైన ఖైదీ పెద్ద విజయం సాధించిన సంగతి తెల్సిందే. అయితే దాని తర్వాత ప్లాప్ కొట్టిన కార్తీ ఈ నెల 2న మరో చిత్రాన్ని విడుదల చేసాడు. కార్తీ, రష్మిక జంటగా నటించిన సుల్తాన్ సినిమా వైల్డ్ డాగ్ తో పోటీగా విడుదలైంది.

టాక్ యావరేజ్ గా వచ్చినా కానీ కలెక్షన్స్ మాత్రం ఈ సినిమాకు అనుకున్నంతగా రాలేదు. సుల్తాన్ కార్తీ ఖాతాలో మరో ప్లాప్ గా నిలిచింది. ఇక ఈ చిత్ర ఓటిటి రిలీజ్ గురించిన తాజా సమాచారం ఇప్పుడు బయటకు వచ్చింది.

మే 2న ఈ సినిమా తమిళ, తెలుగు వెర్షన్స్ ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో విడుదల కానున్నాయి. తమిళ వెర్షన్ డిస్నీ+హాట్ స్టార్ లో విడుదలవుతుంది. అలాగే తెలుగు వెర్షన్ ఆహా ప్లాట్ ఫామ్ లో వస్తుంది.


Recent Random Post: