తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులతో పెద్ద ఎత్తున షర్మిల తలపెట్టిన రిలే నిరాహార దీక్షలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతో రిలే నిరాహార దీక్షలు చేపట్టకుండా ఉండటం మంచిదనే నిర్ణయానికి వచ్చి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవల షర్మి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగిన నిరాహార దీక్ష లో పాల్గొన్న పిట్ట రాంరెడ్డి మరియు కొందరు నాయకులకు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది.
షర్మిల పార్టీ ఏర్పాటుకు సిద్దం అవుతున్న నేపథ్యంలో ముందస్తుగా ప్రజల్లోకి వెళ్లేందుకు రిలే నిరాహార దీక్ష ల కార్యక్రమం మొదలు పెట్టింది. కాని కరోనా కారణంగా ఆమె కార్యక్రమాలు ఆరంభం అయిన వెంటనే ఆగిపోయే పరిస్థితి వచ్చింది. కరోనా ఉదృతి తగ్గిన వెంటనే ఖచ్చితంగా మళ్లీ రిలే నిరాహార దీక్షలను చేపట్టడంతో పాటు నిరుద్యోగుల కోసం అండగా ఉండేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వం దృష్టికి వారి సమస్యలు తీసుకు వస్తానంటూ షర్మిల హామీ ఇచ్చారు.
Recent Random Post: