హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ లో బిజీగా ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ ఫిట్నెస్ ఫ్రీక్ ఒక భారీ ట్రక్ ను నడిపిందట. నిజంగానే ఆమె ట్రక్ ను నడిపినా అది అంతా సినిమా కోసమే. బాలీవుడ్ లో సర్దార్ కా గ్రాండ్ సన్ అనే సినిమా చేస్తోంది రకుల్ ప్రీత్.
ట్రక్ నడిపిన అనుభవంపై రకుల్ మాట్లాడుతూ తనకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టమని, ట్రక్ ను నడపడం కష్టమే అయినా తానే నడపాలని అనుకున్నట్లు, సెట్ లో ఉన్న ఒక ట్రైనర్ టిప్స్ తో ట్రక్ ను సులువుగా నడిపేసినట్లు రకుల్ చెబుతోంది. “సెట్ లో అందరూ నా డ్రైవింగ్ స్కిల్స్ చూసి ఆశ్చర్యపోయారు. ఈ అనుభవం నాకు సరికొత్తగా ఉంది” అని తెలిపింది.
అర్జున్ కపూర్ హీరోగా నటిస్తోన్న సర్దార్ కా గ్రాండ్ సన్ చిత్రం మే 18న నెట్ ఫ్లిక్స్ లో విడుదలవుతోంది.
Recent Random Post: